ట్రాఫిక్ క‌ష్టాలు.. స్మార్ట్ పెళ్లికూతురు

This Bengaluru bride took the metro to reach her wedding on time. వైర‌ల్ అవుతున్న ఓ వీడియో బెంగ‌ళూరు న‌గ‌ర ప్ర‌జ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2023 10:56 AM IST
ట్రాఫిక్ క‌ష్టాలు.. స్మార్ట్ పెళ్లికూతురు

ప్ర‌తి సంవ‌త్స‌రం వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌తో పాటు ర‌వాణా వాహ‌నాల సంఖ్య‌ పెరిగిపోతుండ‌డంతో ట్రాఫిక్ ర‌ద్దీ పెరుగుతోంది. మెట్రో న‌గ‌రాల్లో అయితే ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ఆఫీసుల‌కు లేదా ఇంకా ఎక్క‌డికైనా వెళ్లాలంటే ఓ రెండు గంట‌ల ముందు బ‌య‌లుదేరితే త‌ప్పా స‌మాయానికి వెళ్ల‌డం సాధ్యం కావ‌డం లేదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియో బెంగ‌ళూరు న‌గ‌ర ప్ర‌జ‌ల ట్రాఫిక్ క‌ష్టాలను తెలియ‌జేస్తుంది.

ఓ వ‌ధువు త‌న పెళ్లి కోసం ఇంటి నుంచి క‌ళ్యాణ మండ‌పానికి కారులో బ‌య‌లుదేరింది. అయితే.. ఆమె ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఎంత సేపు చూసినా కారు కాస్త కూడా ముందుకు వెళ్ల‌క‌పోవ‌డంతో తాను స‌మ‌యానికి పెళ్లి మండ‌పానికి వెళ్ల‌గ‌ల‌నా అని భ‌య‌ప‌డింది. వెంట‌నే ఆమెకు ఓ మెరుపు లాంటి ఆలోచ‌న వ‌చ్చింది. కారు దిగి పెళ్లి కూతురు ముస్తాబులోనే మెట్రో రైలు ఎక్కి క‌ళ్యాణ మండ‌పానికి చేరుకుంది. ఒంటినిండా బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించిన పెళ్లి కూతురును చూసి తోటీ ప్ర‌యాణీకులు కాస్త ఆశ్చ‌ర్య‌పోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. యువ‌తి స‌మ‌య‌స్పూర్తిగా ఆలోచించింద‌ని అంటున్నారు. ‘స్మార్ట్ పెళ్లికూతురు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story