ఎంతకీ పెళ్లి కావ‌డం లేద‌ని.. వ‌ధువు కాలెవ‌ను అంటూ షాప్ ముందు బోర్డు

Tea stall owner puts sign board for Bride.ఇటీవ‌ల కాలంలో పెళ్లికాని బాబుల సంఖ్య పెరిగిపోతుంది. అనుకున్న జాబ్ దొర‌క్క

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sept 2021 2:03 PM IST
ఎంతకీ పెళ్లి కావ‌డం లేద‌ని.. వ‌ధువు కాలెవ‌ను అంటూ షాప్ ముందు బోర్డు

ఇటీవ‌ల కాలంలో పెళ్లికాని బాబుల సంఖ్య పెరిగిపోతుంది. అనుకున్న జాబ్ దొర‌క్క జీవితంలో స్థిర‌ప‌డిన త‌రువాత‌నే వివాహం చేసుకోవాల‌నుకునే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. అయితే.. ఉద్యోగం దొరికి జీవితంలో స్థిర‌త్వం వ‌చ్చేస‌రిగా వ‌య‌స్సు పెరిగిపోతుంది. దీంతో చాలా మందికి వివాహం కావ‌డం లేదు. చేసుకుందామ‌ని అనుకున్నా.. అమ్మాయి త‌ల్లిదండ్రుల అంచ‌నాలు అందుకోవ‌డం అంత సుల‌భం కావ‌డం లేదు నేటి రోజుల్లో. చాలా మంది మ్యాట్రీమోనీస్‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

అయితే.. అంద‌రిలా కాకుండా ఈ యువ‌కుడు కొంచెం వైర‌టీగా ఆలోచించాడు. త‌న బుర్ర‌కు ప‌దును పెట్టాడు. వధువు కావాలంటూ ఏకంగా తన దుకాణాని‏కే ఓ బోర్డ్ త‌గిలించాడు కేర‌ళ రాష్ట్రానికి చెందిన ఉన్నికృష్ణ‌న్‌(33). త్రిచూర్ ప్రాంతంలో నివ‌సిస్తున్న‌ ఉన్నికృష్ణ‌న్ టీ స్టాల్ న‌డుపుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. ఎన్నో సంబంధాలు చూసినా ఏదీ సెట్ కావ‌డం లేదు. వ‌య‌సు పెరిగిపోతుంది. ఇక లాభం లేదు అనుకుని ఓ స‌రికొత్త ఆలోచ‌న చేశాడు. ఓ అట్టాముక్క‌పై వ‌ధువు కావ‌లెను అంటూ రాసి త‌న టీ దుకాణం ముందు త‌గిలించాడు. కులం, మ‌తంతో సంబంధం లేద‌నే ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చాడు. త‌న ఫోన్ నెంబ‌ర్ సైతం అందులో రాశాడు.

ఉన్నికృష్ణ‌న్ కు తెలియ‌కుండా ఫోటో తీసిన అత‌డి స్నేహితుడు.. ఆఫోటోను సోష‌ల్ మీడియాలో ఉంచాడు. ఆ ఫోటో వైర‌ల్‌గా మారింది. విదేశాల నుంచి సైతం కృష్ణ‌న్‌కు ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయి. కొంద‌రు నీ ఐడియా బాగుంది.. మంచం సంబంధం దొర‌కాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. సోష‌ల్ మీడియాలో ఇంత ర‌చ్చ జ‌రుగుతున్నా.. అవేవి ప‌ట్టించుకోకుండా ఉన్ని కృష్ణ‌న్‌.. త‌న‌కు ఎలాంటి ప్ర‌పోజ‌ల్ వ‌చ్చాయో చూసుకుంటున్నాడు. నేను రోజువారీ కూలీని. నా తలలో కణతి ఉండటంతో సర్జరీ కూడా జరిగింది. దాని నుంచి పూర్తిగా రికవరీ అయ్యాను. అందువల్ల ఇప్పుడు జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నా. లక్కీగా ఓ లాటరీ తగలడంతో టీస్టాల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నను. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు సంబంధాలు వెతికారు. అవేవీ సెట్ కాలేదు. అందుకే ఇలా సైన్ బోర్డ్ పెట్టాను అని మీడియాకు చెప్పాడు ఉన్ని.

Next Story