బంగారు గొలుసును ఎవరైనా చోరీ చేస్తే పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతారు. వారికి కోర్టు శిక్ష విధిస్తుంది. అయితే.. ఇక్కడ ఓ బంగారు గొలుసుకుని చోరీ చేసిన.. ఆ కొట్టేసింది ఎవరో తెలిసినా పోలీసులు మాత్రం ఏం చేయలేకపోయారు. ఎందుకంటారా..? ఎందుకంటే ఆ బంగారు గొలుసును చీమలు లాక్కెల్లిపోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎష్ అధికారి దీపాన్షు కబ్రా ట్విట్టర్ వేదికగా పలు వీడియోను పోస్టు చేస్తుంటారు. ఆయన పోస్టు చేసే వీడియోలు ఆలోచింపజేసే విదంగా ఉంటాయి.
ఇటీవల ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ 15 సెకన్ల వీడియోలో కొన్ని చీమలు ఓ బంగారు గొలుసును తీసుకెళ్లిపోతున్నాయి. ఈ వీడియోకు ఆయన అతిచిన్న గోల్డ్ స్మగ్లర్స్ అని పేరు పెట్టారు. ఇక చీమల చేసిన పనిని చూసిన నెటీజన్లు ఆశ్చరపోతూ.. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దొంగ చీమలను అరెస్టు చేశారా సార్..? లేక తప్పించుకున్నాయా..? ఎవరైనా చక్కర వేయండి.. బంగారు గొలుసును తీసుకెళ్లండి అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.