బెడ్రూంలో పాము బుసలు కొడుతున్న శబ్దం.. ఏడుస్తూ ఫోన్ చేసిన మ‌హిళ‌

Singapore woman calls SOS after suspecting cobra hissing in bedroom.చాలా మందికి పాము అంటే చాలా భ‌యం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2021 2:50 PM IST
బెడ్రూంలో పాము బుసలు కొడుతున్న శబ్దం.. ఏడుస్తూ ఫోన్ చేసిన మ‌హిళ‌

చాలా మందికి పాము అంటే చాలా భ‌యం.పెరట్లో పాము క‌నిపిస్తేనే ఇంట్లోకి పరిగెట్టి త‌లుపులేసుకుంటారు. అలాంటి ఇంట్లోనే క‌నిపిస్తే.. అది కూడా బెడ్ రూమ్‌లోనే చూస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే.. ఓ మ‌హిళ త‌న బెడ్ర్‌రూమ్‌లో పాము దూరింద‌ని.. భ‌యంక‌ర‌మైన శ‌బ్దాలు చేస్తుంద‌ని.. భ‌యంగా ఉంద‌ని, వెంట‌నే వ‌చ్చి త‌న‌ను ర‌క్షించాల‌ని రెస్క్యూ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పింది. ఈ ఘ‌ట‌న సింగ‌పూర్‌లో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. జురోంగ్ వెస్ట్ ప్రాంతంలో జియాన్ అనే మ‌హిళ నివ‌సిస్తోంది. ఆమె రెస్క్యూ హాట్ లైన్‌కు ఏడుస్తూ ఫోన్ చేసింది. త‌న బెడ్రూమ్‌లోని మంచం ద‌గ్గ‌ర ఉన్న అల్మారాలో నాగుపాము ఉంద‌ని, అది హిస్స్ హిస్స్ అంటూ భ‌యంక‌ర‌మైన శ‌బ్దాలు చేస్తోంద‌ని చెప్పింది. అందుకు సంబంధించిన రికార్డును కూడా పంపించింది. త‌న‌ను ర‌క్షించాల‌ని వేడుకుంది. వెంట‌నే రెస్క్యూ టీం ఆఫీసర్ ముహమ్మద్ సఫారీ బిన్ మస్నోర్ హుటాహుటిన అక్క‌డికి చేరుకున్నాడు. ఇంట్లో వెతికితే పాము అత‌డికి క‌న‌ప‌డ‌లేదు.

బాత్రూంలో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఆన్ చేసి ఉండటం కనిపించింది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లోకి పొరపాటున నీళ్లు చేరడంతో ఆటోమేటిక్‌గా ఆన్ అయినట్టు గుర్తించారు. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను స్విచ్ ఆఫ్ చేయడంతో పాములా వచ్చిన హిస్సింగ్ శబ్ధం ఆగిపోయింది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ చేసే శ‌బ్దం పాము చేసే శ‌బ్దంలా ఉండ‌డంతో ఆ మ‌హిళ నాగుపాము అని పొరపాటు ప‌డింద‌ని గ్ర‌హించారు. అక్క‌డ నాగుపాము లేక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

Next Story