ప్ర‌స్తుతం టెక్నాల‌జీ బాగా పెరిగిపోయింది. వాటిని వినియోగించేట‌ప్పుడు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే అన‌ర్థాలు కోరి తెచ్చుకోక త‌ప్ప‌దు. పాపం శ్వేత అనే అమ్మాయి జూమ్‌లో ఆన్‌లైన్ క్లాసులు వింటోంది. మైక్‌ను మ్యూట్ చేయ‌డం మ‌రిచిపోయింది. దీంతో నిన్న మొత్తం ఆమె పేరు ట్విట‌ర్‌లో టాప్ ట్రెండ్స్‌లో ఉంది. అస‌లు ఆ పేరు ఎందుకు ట్రెండింగ్ అవుతోందో చాలా మందికి అర్థం కాలేదు. ప్ర‌స్తుతం ఆ అమ్మాయి పేరు మీద జోకులు, మీమ్స్‌తో ట్విట్ట‌ర్ నిండిపోయింది. అస‌లు శ్వేత ఎవ‌రు అని ఆరా తీయ‌గా.. ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

క‌రోనా కార‌ణంగా స్కూళ్లు, కాలేజీలు పాఠాలు అన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే న‌డుస్తున్నాయి. ఆన్‌లైన్ క్లాసులు వినేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అవ‌స‌రం ఉంటేనే మైక్‌ను ఆన్ చేయాలి లేదంటే ఆ స‌మ‌యంలో ఉన్న వాళ్లందరికి మనం మాట్లాడేది విన‌బడుతుంది. దాని వ‌ల్ల మ‌నం ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంది. స‌రిగ్గా శ్వేత అనే అమ్మాయి కూడా ఇదే పొర‌పాటు చేసింది. ఆన్‌లైన్ క్లాస్ వింటూ మ్యూట్‌లో పెట్ట‌డం మ‌రిచిపోయింది. అదే స‌మ‌యంలో త‌న ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆమె మాట్లాడింది త‌న ఫ్రెండ్ సీక్రెట్ రొమాంటిక్ రిలేష‌న్ షిప్ గురించి.

అదంతా క్లాస్‌లో ఉన్న 111 మంది విద్యార్థులు విన్నారు. కొంద‌రు ఆమెను మ్యూట్‌లో పెట్టుకోమ‌ని చెబుతున్నా ఆమె.. వారి మాట‌లు వినిపించుకోలేదు. ఇంకేముంది శ్వేత వైర‌ల్‌గా మారింది. ఆమె మాట్లాడిని మాట‌ల తాలూకు ఆడియో క్లిప్పులు వైర‌ల్‌గా మారాయి. వందల కొద్ది మీమ్స్, జోకులు పేల‌డంతో.. ట్విట్ట‌ర్‌లో ఏకంగా టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది.
తోట‌ వంశీ కుమార్‌

Next Story