ఈ భూప్రపంచంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. కొన్ని వింతలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్నిమాత్రం ఆలోచనలను, భయాన్ని కలిగిస్తాయి. ఇంటర్నెట్ కారణంగా ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా ప్రభావంతో ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది.
నైజీరియాలోని లాగోస్ అనే ప్రాంతంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా కొందరు వ్యాపారులు గొర్రెను అమ్మకానికి పెట్టారు. ఆ గొర్రెల్లో ఒక గొర్రె అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా గొర్రెకు రెండు కొమ్ములు ఉంటాయి. అయితే.. నైజీరియాలో దర్శనమిచ్చిన గొర్రెకు మాత్రం ఏకంగా అయిదు కొమ్ములు ఉన్నాయి. గొర్రెలను కొనుగోలు చేసేందుకు వచ్చినవారు ఆ గొర్రెతో ఫోటోలు దిగారు. ఈ విచిత్ర గొర్రెను అక్కడ ఉన్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇంకేముంది.. ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ట్వీట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. చూడటానికి అది అచ్చంగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తలపై ఉన్న కిరీటం మాదిరిగా ఉందని కొందరు కామెంట్లు చేస్తుండగా.. ఇంకొందరు ఏమో ఇదేదో కీడును శంకిస్తోందని.. కలియుగాంతం ను మరోసారి తెలిపైకి తెస్తున్నారు.