నాకు ఓటు వేస్తే.. రూ.20కే లీటర్ పెట్రోల్, రూ.100కే గ్యాస్ సిలిండర్, ఇంటికో బైక్ ఇంకా
Panchayat Poll Candidate promises are going viral on social media.సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థి ఇచ్చిన హామీలు
By తోట వంశీ కుమార్
తాము గెలిస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు హామీలు ఇస్తుంటారు. వాటిని నెరవేరుస్తారా..? లేదా అన్నది కాస్త పక్కన పెడితే.. కొందరు అభ్యర్థులు మాత్రం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తుంటారు. ఇక్కడ కూడా ఓ సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థి ఇచ్చిన హామీలు చూసి అక్కడి జనం విస్తుపోయారు.
"లీటర్ పెట్రోల్ రూ.20కి, జీఎస్టీ రద్దు చేస్తా, గ్యాస్ సిలిండర్ రూ.100, ఇంటికో బైక్, మందు తాగేవారికి మందు బాటిల్ ఫ్రీ, ఫ్రీ వైపై" అంటూ ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది ఐపీఎల్ ఆఫీసర్ అరుణ్ బోత్రా కంటపడింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. "నేను ఆ గ్రామానికి షిఫ్ట్ అవుతున్నా" అంటూ ఫన్నీగా పేర్కొంటూ ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
Am shifting to this village 🤣 pic.twitter.com/fsfrjxbdLc
— Arun Bothra 🇮🇳 (@arunbothra) October 9, 2022
హర్యానాలోని సిర్సద్ గ్రామానికి చెందిన జైకరణ్ లత్వాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోని ఓ పోస్టర్ రూపంలో విడుదల చేశాడు. అందులో తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామం చుట్టూ మూడు ఎయిర్ పోర్టులు నిర్మిస్తా. బస్సుల స్థానంలో హెలికాప్టర్లను ఏర్పాటు చేసి, ఐదు నిమిషాలకు ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తా. ఢిల్లీ వరకు నేరుగా మెట్రో రైలు ఏర్పాటు చేస్తా. అంతేకాదు మహిళలకు ఫ్రీగా మేకప్ కిట్లు అందజేస్తా, లీటర్ పెట్రల్ రూ.20కే ఇస్తా, ఒక్కొక్కరికి ఒక బైక్ కొనిస్తా, జీఎస్టీ రద్దు చేస్తా, గ్యాస్ సిలిండర్ రూ.100కే ఇస్తా, గ్రామం మొత్తం ఉచిత వైఫై సౌకర్యం, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, మందుబాబులకు మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇస్తా అంటూ ఆ పోస్టర్‌లో ముద్రించాడు.
ఈ పోస్టర్ వైరల్‌గా మారగా.. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతన్నారు.