కోయంబత్తూరులో గోల్డ్ కాయిన్ ఏటీఎం

New ATM machine launched in Coimbatore.కార్డు పెడితే డబ్బులు వచ్చే ఏటీఎంలు తెలుసు. ఏటీఎం ద్వారా అకౌంట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2021 4:14 AM GMT
కోయంబత్తూరులో గోల్డ్ కాయిన్ ఏటీఎం

కార్డు పెడితే డబ్బులు వచ్చే ఏటీఎంలు తెలుసు. ఏటీఎం ద్వారా అకౌంట్ లో డిపాజిట్ చేసుకునే అవకాశన్ని కూడా వినియోగించుకున్నాం. ఇప్పుడు మరో కొత్త ప్రయోగాన్ని కూడా చూడబోతున్నాం. ఎక్కడంటే.. కోయంబత్తూర్‌ లో..

స్థానిక క్రాస్‌ కట్‌ రోడ్డులో గోల్డ్‌ ఆన్‌ ది గో పేరిట బంగారు నాణేల ఏటీఎం ప్రారంభమైంది. ఫుల్ మూన్ ఎక్స్పోర్ట్ గోల్డ్, జ్యువలరీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ మెషిన్ ద్వారా బంగారం కొనుగోలు చేయాలనుకొనే వినియోగదారులు షాప్ లకి పరిగెత్తకుండా చక్కగా క్యాష్ లేదా ఆన్‌లైన్‌లో చెల్లింపులతో ఈ యంత్రం నుంచి బంగారు నాణేలు పొందవచ్చు. ఈ విషయమై బంగారు నాణేల తయారీ సంస్థల ఆర్గనైజర్‌ శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి కారణంగా దుకాణాలకు వినియోగదారుల రాకను తగ్గించేలా ఈ ఏటీఎం ఏర్పాటుచేశామన్నారు.

ఈ యంత్రం ద్వారా రెండు నిముషాల్లో బంగారు నాణేలు కొనుక్కోవచ్చు. 1 గ్రాము, 2, 4, 8 గ్రాముల నాణేలను, ఆ సమయానికి మార్కెట్‌లో ఉన్న ధరకు అనుగుణంగా పొందవచ్చు. ఒకేసారి రూ.50 వేలు డిపాజిట్‌ యంత్రంలో జమచేసి నాణేలు తీసుకోవచ్చు. అన్నట్టు ఈ నాణేలకు క్యూ ఆర్‌ కోడ్‌ ఉంది. దీని స్కాన్‌ చేస్తే వినియోగ దారుని పేరు, చిరునామా, సెల్‌ఫోన్‌ నెంబరు, జీఎస్టీ తదితర వివరాలను లభిస్తాయని తెలిపారు. ఇలాంటి ఒక్కో మెషిన్ ను తయారు చేయడానికి 20 లక్షలు అవుతుంది. ఇలాంటి ఏటీఎం లను కోయంబత్తూరు నగరంలో 10 నుండి 20 వరకు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.


Next Story