విచిత్రం.. కాబోయే అల్లుడితో ప్రేమలో పడ్డ అత్తగారి ప్రేమకథ.. వైరల్
Mother Fall in love with Daughter Fiance.ఏ అమ్మాయి అయిన తన పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. ఆ రోజు కోసం
By తోట వంశీ కుమార్ Published on 18 Nov 2021 6:05 AM GMTఏ అమ్మాయి అయిన తన పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. ఇక తల్లిదండ్రులకు తమ కుమారైకు పెళ్లి చేసి డోలీలో పంపే రోజు చాలా ప్రత్యేకమైంది. ఆ రోజు కోసం వారు కూడా ఎదురుచూస్తుంటారు. అల్లుడినే తమ కొడుకులా బావిస్తారు. ఇక అల్లుడు కూడా అత్తమామలకు సన్మానం చేయడం, గౌరవించడం చూసే ఉంటాం. అయితే సొంత కూతురి పెళ్లిలో అల్లుడితో ప్రేమలో పడ్డ అత్తగారి ప్రేమకథ ఏంటో మీకు తెలుసా..!
ఓ మహిళ తన సొంత అల్లుడితో ప్రేమలో పడింది అంతేకాదు ఈ కారణంగా తన కుమార్తె పెళ్లికి వెళ్లేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఈ అత్తగారు, అల్లుడి ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా పెళ్లికూతురు(వధువు) సోషల్ మీడియాలో(వెడ్డింగ్‌బీ పేజీలో) షేర్ చేయడం గమనార్హం. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
వధువు ఏం చెప్పిందంటే..
మా అమ్మ నా పెళ్లికి వచ్చేందుకు నిరాకరించడంతో షాక్‌కు గురయ్యాను. ఎందుకంటే ఆమె.. నాకు కాబోయే భర్తతో ప్రేమలో పడింది. 'మా ఇద్దరితో కలిసి మా అమ్మ తరచూ విహారయాత్రలకు వచ్చేది. మా అమ్మ తన కాబోయే అల్లుడితో కలిసి టెన్నిస్ ఆడుతుందేది. కానీ ఎప్పుడూ ఏమీ వింతగా అనిపించలేదు. దీని గురించి నాకు అస్సలు ఆలోచన లేదు'. అయితే ఈ విషయాన్ని తన తల్లి స్వయంగా వెల్లడించినట్లు పెళ్లి కూతురు చెప్పింది. ఈ విషయం విని తాను షాక్‌కు గురైయ్యానని తెలిపింది.
అయితే..పెళ్లికి మాత్రం అస్సలు రానని ఆ మహిళ మొండికేసింది. అయితే అల్లుడిపై ఉన్న ఫీలింగ్స్ అన్నీ తప్పకుండా మారుస్తానని ఆ మహిళ చెప్పడం గమనార్హం. ఈ విషయం విని అల్లుడు సైతం ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేం లవ్‌స్టోరీ అని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.