వైన్స్​లోకి దూరి.. బాటిల్ మూత తెరిచి మ‌రీ మందేసిన కోతి.. వీడియో వైర‌ల్‌

Monkey Enters Liquor Shop and Drinks Alcohol From Bottle.మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసిందే. అయినప్ప‌టికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2021 2:35 PM IST
వైన్స్​లోకి దూరి.. బాటిల్ మూత తెరిచి మ‌రీ మందేసిన కోతి.. వీడియో వైర‌ల్‌

మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసిందే. అయినప్ప‌టికి మందుబాబులు రోజు పెగ్గు వేయ‌నిదే నిద్ర‌పోరు. మద్యానికి బానిసైన వారు ప్రతిరోజు చుక్క వేయకుండా ఉండలేరు. మ‌ద్యానికి బానిస అవ్వ‌డం అనే స‌మ‌స్య మ‌నుషుల‌కే ఉంది అని అంటారా..? అయితే..మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే. కొద్దిరోజుల‌ క్రితం ఓ కోతి.. వైన్‌షాపు ముందు ప‌డేసిన మ‌ద్యం సీసాలో మ‌ద్యం చుక్క‌ల‌ను రుచి చూసింది. ఇక అది అప్ప‌టి నుంచి ప్ర‌తిరోజు అక్క‌డ వ‌స్తూ ఉంది. సీసాలోని మ‌ద్యం స‌రిపోలేదో ఏమో ఈ సారి ఏకంగా షాపులోకి వెళ్లింది. షాపులోని ఓ వైన్ బాటిల్ తీసుకుని మూత తీసి ఎంచ‌క్కా తాగేసింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ మాండ్లా జిల్లాలోని బహమని బంజార్ గ్రామంలో ఓ వైన్‌షాపు ఉంది. కహ్నా నేషనల్ పార్క్ సమీపంలోని అడవిలో నివసిస్తున్న కోతి.. వారం రోజుల క్రితం ఆ మద్యం దుకాణం వద్దకు వచ్చింది. అక్కడ తాగి పడేసిన మద్యం సీసాల్లో మిగిలిన మద్యం చుక్కలను రుచి చూసింది. ఇక అది అప్ప‌టి నుంచి ప్ర‌తిరోజు అక్క‌డ‌కు వ‌స్తుంది. ఖాళీగా పడి ఉన్న మద్యం సీసాల్లో మిగిలిపోయిన మద్యం చుక్కలను తాగుతుండేది. అయితే.. ఓ రోజు ఏకంగా షాపులోకే వెళ్లింది. అక్కడున్న బీర్‌, వైన్‌ బాటిళ్లను పక్కకు పెట్టి విస్కీ బాటిల్‌ను టార్గెట్‌ చేసింది.

ఓ టెబుల్‌పై దర్జాగా కూర్చొని విస్కీ బాటిల్‌ మూతను నెమ్మదిగా తీసేందుకు ప్రయత్నిస్తుంది. చివరికి మూత ఒపెన్‌ అవ్వడంతో ప్రొఫెషనల్‌ మందుబాబులా గటాగటా తాగేసింది. షాప్ నిర్వాహకుడు దానికి బిస్కెట్ ఇచ్చేందుకు య‌త్నించ‌గా.. నిరాకరించింది. మద్యం తాగిన తరువాత ఆ కోతి.. అక్కడే ఉన్న గ్లాస్‌లోని వాటర్‌ను తాగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. కోతి మద్యం సేవించడాన్ని వైన్ షాప్‌ కు వచ్చిన పలువురు వీడియో తీశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story