జిమ్‌లో చెమటోడుస్తున్న అసదుద్దీన్ ఒవైసీ.. వీడియో వైరల్
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జిమ్‌లో చెమటోడుస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 12 July 2023 8:02 PM IST
జిమ్‌లో చెమటోడుస్తున్న అసదుద్దీన్ ఒవైసీ.. వీడియో వైరల్
ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. దీనికోసం సాధారణంగా ఎక్కువ మంది మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు. ఇంకా కొందరు అయితే యోగాసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మరింత ఫిట్‌గా కనిపించాలంటే మాత్రం జిమ్‌కు వెళ్లాల్సిందే. ఎక్కువగా హీరోలు, హీరోయిన్లు సినిమాల్లో కనిపించే వారే జిమ్‌లకు వెళ్తుంటారు. అదే రాజకీయ నాయకుల విషయానికి వస్తే.. వారికి ప్రజా సేవలో, ప్రెస్‌మీట్లలో ఉండటానికే టైమ్ సరిపోతుంది. ఇక జిమ్ అంటే కష్టమే అంటుంటారు. కాకపోతే ఇప్పుడున్న చాలా మంది నాయకులు డైట్ ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఇంకొందరు యోగా.. మార్నింగ్ వాక్‌లు చేస్తుంటారు. జిమ్‌లో చెమటోడిచే వారు అంటే అరుదనే చెప్పాలి.
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం తన ఫిట్నెస్‌ను కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్‌లో తెగ కష్టపడిపోతున్నారు. బరువులు ఎత్తుతూ చెమటోడుస్తున్నారు. యాభై పదుల వయసులో ఆయన అలా జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చూసినట్లు అయితే.. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ టేబుల్‌పై పడుకుని డంబెల్స్‌ను ఎత్తుతున్నారు. చూడ్డానికి అవి ఎక్కువ బరువు ఉన్నవే అని అర్థమవుతోంది. కళ్లజోడు పెట్టుకునే ఆయన జిమ్ చేయడం వీడియోలో గమనించవచ్చు. ట్రైనర్ సమక్షంలో అసదుద్దీన్ ఒవైసీ డంబెల్స్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. ఒవైసీ డంబెల్స్‌ను లేపుతుంటే.. ట్రైనర్ లెక్కిస్తున్నారు. ఊపిరి తీసుకుంటూ వదులుతూ అసదుద్దీన్ డంబెల్స్‌తో వర్కౌట్ చేశారు. అప్పటికే ఆయన జిమ్‌లో చాలా కష్టపడినట్లు ఉన్నారు.. టీషర్ట్ పూర్తిగా చెమటతో తడిచిపోయింది. అయితే.. జిమ్‌లో అసదుద్దీన్ వర్కౌట్ చేస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో షెడ్యూల్‌లోనూ అసదుద్దీన్ ఒవైసీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్‌లో కష్టపడుతుండటాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.