వింత ప్ర‌క‌ట‌న.. అలాంటి శ‌రీరాకృతి ఉన్న అమ్మాయే కావాలి

Matrimonial ad seeking bride with specific bra.సాధార‌ణంగా వ‌ధువు కావ‌లెను, వ‌రుడు కావ‌లెను లాంటి ప్ర‌క‌ట‌న‌లు మ‌నం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2021 7:11 AM GMT
వింత ప్ర‌క‌ట‌న.. అలాంటి శ‌రీరాకృతి ఉన్న అమ్మాయే కావాలి

సాధార‌ణంగా వ‌ధువు కావ‌లెను, వ‌రుడు కావ‌లెను లాంటి ప్ర‌క‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉంటాం. అందులో తమకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవారు కావాలో తెలియ‌జేస్తుంటారు. తాజాగా ఓ యువ‌కుడు మ్యాట్రిమోనియ‌ల్ వైబ్‌సైట్‌లో ఇచ్చిన ప్ర‌క‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మామూలుగా అయితే వ‌ధువు చ‌దువ‌కుని ఉండాల‌నో, ఉద్యోగం చేయాల‌నో, ఇంత హైట్ ఉండాల‌నే, ఇలాంటి క‌ల‌ర్ ఉన్న అమ్మాయినో ప్ర‌క‌ట‌న‌లో అడుతుండ‌డం చూసి ఉంటాం.. కానీ ఓ యువ‌కుడు ఏకంగా అమ్మాయి శ‌రీర కొల‌త‌లు ఇలా ఉండాలంటూ ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. దీనిపై నెటీజ‌న్లు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు.

5 అడుగుల 2 అంగుళాల నుంచి 5'6" ఎత్తు, 32 బి నుంచి 32 సి సైజు ఉన్న బ్రా, 16 పరిమాణం నడుము ఉన్న వధువు కావాలని కోరుతూ ఓ యువ‌కుడు బెటర్‌హాఫ్.ఐ అనే మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రకటన ఇచ్చారు. వధువు సంప్రదాయవాది కాకుండా ఉదారవాదిగా ఉండాలని, సరదాగా ఉండాలని, మంచంపై పడుకునేటపుడు కూడా మంచి దుస్తులు ధరించాలి. ఆ అమ్మాయి వ‌య‌స్సు 18 నుంచి 26 మ‌ధ్య ఉండాలి. త‌న‌తో పాటు సినిమాలు, టూర్స్‌కు రావాలి. ఇప్పుడే పిల్ల‌లు వ‌ద్దు, అంతేకాదు ఆ అమ్మాయి కుక్క‌ల‌ను ప్రేమించాల‌ని అంటూ ప్ర‌క‌ట‌న ఇచ్చాడు.

ఈ ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ప్ర‌క‌ట‌న చూసిన నెటిజన్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. స‌ద‌రు మ్యాట్రీమోనీ సైట్‌పై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు. స్పందించిన‌ మ్యాట్రీమెనియ‌ల్ సైట్.. త‌మ ష‌ర‌తులు, నిబంధ‌న‌లు ఉల్ల‌గించినందుకు స‌ద‌రు వ్య‌క్తిపై చ‌ర్యలు తీసుకుంటామ‌ని తెలిపింది.

Next Story