అదృష్టం అంటే ఇత‌డిదే.. రూ.100తో కోటి రూపాయ‌లు గెలిచాడు

Mandya man wins one crore lottery.నిజంగా అదృష్టం అంటే అత‌డిదే అని చెప్పాలి. సామాన్యుడిగా పెళ్లికి వెళ్లిన అత‌డు రూ.100తో కోటిశ్వ‌రుడు అయిపోయాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2021 4:26 AM GMT
Mandya man wins one crore lottery

నిజంగా అదృష్టం అంటే అత‌డిదే అని చెప్పాలి. సామాన్యుడిగా పెళ్లికి వెళ్లిన అత‌డు కోటిశ్వ‌రుడు అయిపోయాడు. ‌సినిమాల్లో మాత్ర‌మే రాత్రికి రాత్రి కోటిశ్వ‌రులు అయిపోవ‌డం చూసి ఉంటాం కానీ.. క‌ర్ణాట‌క కు చెందిన ఓ వ్య‌క్తి త‌న బంధువుల పెళ్లికి వెళ్లాడు. అక్క‌డ రూ.100 పెట్టి లాట‌రీ టిక్కెట్ కొన‌గా.. విజ‌యం అత‌డినే వ‌రించింది. దీంతో అక్ష‌రాల కోటి రూపాయ‌లు అత‌డి సొంతం అయ్యాయి.

వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటకలో మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్ళి గ్రామంలో సోహాన్‌ బలరాం అనే యువ‌కుడు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఈ నెల 5న త‌న కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం కేరళకు వెళ్లాడు. పెళ్లి అనంత‌రం అదే ఊరిలో నివాసం ఉంటున్న త‌న మిత్రుడు దేవ‌దాసు ప్ర‌భాక‌ర్ ఇంటికి వెళ్లాడు. అక్క‌డ నుంచి తిరిగి వ‌చ్చేట‌ప్పుడు త‌న మిత్రుడు లాట‌రీ టికెట్ కొనుగోలు చేయాల్సిందిగా అత‌డిని బ‌ల‌వంతం చేశాడు. దీంతో అత‌డి మాట‌ను కాద‌న‌లేక..‌ దేవదాసు దుకాణంలోనే కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ను రూ.100 పెట్టి కొన్నాడు.

అనంత‌రం కుటుంబంతో క‌లిసి త‌న సొంతూరికి వెళ్లాడు. అనంత‌రం బ‌ల‌రాంకి ఫోన్ చేసిన దేవ‌దాసు.. లాట‌రీలో నువ్వు కోటి రూపాయ‌లు గెలిచావ్ అని చెప్పాడు. అయితే.. తొలుత అత‌డి మాటల‌ను బ‌ల‌రాం న‌మ్మ‌లేదు. కానీ.. దేవ‌దాసు వెంట‌నే లాట‌రీ టికెట్ తీసుకుని రావాలని ఒత్తిడి చేశాడు. దీంతో చేసేది లేక వెంట‌నే లాట‌రీ టికెట్ తీసుకుని స్నేహితుడి ద‌గ్గ‌రికి వెళ్లి .. డ్రాలో చూసుకునే స‌రికి నిజంగానే లాట‌రీ త‌గిలింద‌ని తెలిసింది. దీంతో అత‌డి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. వెంట‌నే స్వీట్లు కొని అక్క‌డ ఉన్న వారంద‌రికి పంచి పెట్టాడు.


Next Story