ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త
Man sacrifices his marriage weds his wife to her boyfriend.పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. తన భార్య తనతో
By తోట వంశీ కుమార్ Published on 31 Oct 2021 8:15 AM ISTపెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. తన భార్య తనతో సంతోషం ఉండడం లేదన్న విషయాన్ని గ్రహించాడు. ఆమె ఎందుకు సంతోషంగా లేదో అందుకు గల కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. పెద్ద మనస్సుతో ఆమెను అర్థం చేసుకున్నాడు. భర్తగా విడాకులు ఇచ్చి తండ్రి స్థానంలో నిలబడి ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కాన్పుర్‌కు చెందిన పంకజ్‌కు కోమల్‌తో ఆరు నెలల క్రితం పెళ్లి జరిగింది. వివాహం జరిగినప్పటినప్పటి నుచి కోమల్ భర్తతో అంటి ముట్టనట్లుగానే ఉంటోంది. కొద్ది రోజులు ఓపిక పట్టిన పంకజ్.. భార్య ఎందుకు ఇలా ప్రవరిస్తుందోనని తెలుసుకోవాలని అనుకున్నాడు. సమస్యేంటని కోమల్‌నే అడిగాడు. నువ్వు ఆనందంగా ఉండడం కోసం ఏమైనా చేస్తానని మాట ఇచ్చాడు. దీంతో కోమల్ ధైర్యం తెచ్చుకుని.. అసలు విషయాన్ని చెప్పింది.
పెళ్లికి ముందే తాను పింటు అనే వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. అయితే.. పెద్దలు బలవంతంగా వివాహం చేసినట్లు తెలిపింది. పింటుతో అయితే సుఖంగా ఉంటానని చెప్పింది. కోమల్ చెప్పేదంతా ప్రశాంతంగా విన్న పంకజ్ కోపగించుకోలేదు. బాగా ఆలోచించాడు. ప్రియుడితో భార్య పెళ్లి చేయాలని అనుకున్నాడు. ముందుగా ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడాడు. అందరికి తనే నచ్చజెప్పాడు. భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం పింటు, కోమల్‌కు వివాహం జరిపించారు. ఈ వివాహం కాన్పూర్‌లో చర్చనీయాంశంగా మారింది.