తండ్రి అస్థికలను బీరులో కలిపి.. డ్రైనేజీలో పారబోసిన కొడుకు
Man pours father's ashes in drain outside his favourite pub.సాధారణంగా చనిపోయిన వారి అస్థికలను సముద్రంలోనే లేదా
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2021 11:37 AM ISTసాధారణంగా చనిపోయిన వారి అస్థికలను సముద్రంలో లేదా నదుల్లోనూ కలుపుతారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం తన తండ్రి అస్థికల్ని బీరులో కలిపాడు. అనంతరం ఆ బీరును ఏకంగా డ్రైనేజీలో పోశాడు. ఎవరు అతను..? తండ్రి పై ఎందుకంత కోపం..? అని అనుకుంటున్నారా..? అతడికి తండ్రిపై కోపం ఏమీ లేదు. తండ్రి అంటే అతడికి చాలా ఇష్టం. తన తండ్రి ఆఖరి కోరిక మేరకే ఆ కొడుకు ఈ విదంగా చేశాడు. ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది.
బ్రిటన్‌లో కెవిన్ మెక్‌గ్లిన్చి (66) అనే ఓ పెద్దాయన తన కుటుంబంతో కలిసి నివసించేవాడు. అతడు ప్రతి రోజు పబ్‌కు వెళ్లేవాడు. అక్కడ ఓ గ్లాస్ బీరు పుచ్చుకునేవాడు. అతడు తన చివరి రోజుల్లో తన కొడుకు పిలిచి ఓ కోరిక కోరాడు. తాను చనిపోయిన తరువాత తన అస్థికలను తాను రోజు వెళ్లే పబ్‌కి తీసుకువెళ్లి బీరులో కలపాలని అనంతరం ఆ పబ్ ముందు ఉన్న డ్రైనేజీలో వేయాలని కోరాడు. ఈ విషయం విన్న కుటుంబ సభ్యులు తొలుత ఆశ్చర్యపోయారు. అయినప్పటికి ఆ పెద్దాయన చివరి కోరికను అర్థం చేసుకున్నారు.
కెవిన్ మెక్‌గ్లిన్చి మొదటి జయంతి రోజున కుమారుడు ఓవెన్, కూతురు కాస్సిడీ ఇతర కుటుంబసభ్యులు హోలీబుష్ పబ్ దగ్గరకు చేరుకున్నారు. ఓ గ్లాస్ బీరులో తండ్రి అస్థికలను కలిపారు. అనంతరం డ్రైనేజీలో పారబోశారు. ఇలా చేసి తండ్రి చివరి కోరికను నెరవేర్చాడు. దీనిపై ఓవెన్ మాట్లాడుతూ.. 'మా నాన్నకు హోలీ బుష్ పబ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. అక్కడి డ్రైనేజీలో తరచూ ఏదో ఒకటి పాడేసేవాడు. అవి ఎలాంటివంటే జుట్టు, గోర్లు లాంటివి. డ్రైనేజీలో ఆయన తన అస్థికలు ఎందుకు కలపమన్నారంటే.. మేము అటువైపు వెళ్లిన ప్రతీసారి గుర్తుకురావాలన్న ఉద్దేశ్యంతో' అని చెప్పాడు