క‌రెంట్ దొంగ‌.. అడ్డంగా బుక్క‌య్యాడు.. వీడియో వైర‌ల్‌

Man crawls in balcony to cut illegal power line.ఆ ఏరియాలో విద్యుత్ వినియోగం ఎక్కువ‌గా ఉంది. అయితే.. అక్క‌డి విద్యుత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2021 10:53 AM IST
క‌రెంట్ దొంగ‌.. అడ్డంగా బుక్క‌య్యాడు.. వీడియో వైర‌ల్‌

ఆ ఏరియాలో విద్యుత్ వినియోగం ఎక్కువ‌గా ఉంది. అయితే.. అక్క‌డి విద్యుత్ బిల్లులు చెల్లించే వారి సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంది. దీంతో విద్యుత్ చౌర్యం జ‌రుగుతుంద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన అధికారులు చెప్పాపెట్ట‌కుండా ఆ ఏరియాకు వెళ్లి విద్యుత్ చౌర్యానికి పాల్ప‌డుతున్న వారిని ప‌ట్టుకుంటున్నారు. ఈ విష‌యం తెలిసిన‌ ఓ వ్య‌క్తి తాను అధికారుల‌కు దొర‌క‌కూడ‌ద‌ని.. వారు త‌న ఇంటికి రాక‌ముందే క‌నెక్ష‌న్‌ను క‌ట్ చేద్దామ‌ని ప్ర‌య‌త్నించాడు. ఆ వ్య‌క్తి చేసిన ఫీట్ల‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గ‌జియాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి అక్ర‌మ క‌నెక్ష‌న్‌తో విద్యుత్ చౌర్యానికి పాల్ప‌డుతున్న‌ట్లు అధికారుల‌కు స‌మాచారం అందింది. దీంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి వెళ్లారు. వారిని గ‌మ‌నించిన స‌ద‌రు వ్య‌క్తి.. అధికారులు రాక‌ముందే ఆక‌నెక్ష‌న్‌ను ఎలాగైనా తొల‌గించాల‌ని బావించాడు. పాక్కుంటూ డాబా మీద‌కు చేరుకున్నాడు. క‌నెక్ష‌న్‌ను తొల‌గించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాడు.

అయితే.. అప్ప‌టికే మ‌రో ఇంటి మిద్దె మీద‌కు చేరుకున్న ఓ అధికారి స‌ద‌రు వ్య‌క్తి చేసుకున్న త‌తంగాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తున్నాడు.' బ్ర‌ద‌ర్ నేనిక్క‌డే ఉన్నా' అని అన్నాడు. ఆ అధికారిని చూసిన ఆ వ్య‌క్తి ఖంగుతిన్నాడు. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ‌టంతో తెల్ల‌ముఖం వేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story