ప్రస్తుతం అంతా డిజిటలైజ్ అయిపొయింది. కరోనా మహమ్మారి కారణంగా చేతితో నగదు ఇవ్వడానికి జనాలు జంకుతున్నారు. దీంతో ఎక్కువ మంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పెళ్లిళ్లలో చదివింపులు(కట్నాలు) కూడా డిజిటలైజ్ అయిపోయాయి. ఓ జంట ఏకంగా తమ పెళ్లి పత్రికపైనే క్యూ ఆర్ కోడ్ ముద్రించింది. తమకు కానుకలు ఇవ్వాలనుకునే వారు నేరుగా ఆ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఇవ్వొచ్చునని తెలిపింది.
తమిళనాడులోని మధురైలో ఓ కుటుంబం వెరైటీ పెళ్లి పత్రికను ప్రచురించింది. తమ కూతురి పెళ్లి కోసం .. వివాహ ముహూర్త ఆహ్వాన పత్రికపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. పెళ్లిన వచ్చిన అతిథులు కానీ, రాలేని వారు కాని ఇంటి నుంచే ఆ క్యూర్ కోడ్‌ల ద్వారా పెళ్లి కట్నాలను ఇచ్చుకునే అవకాశం కల్పించారు.
కొత్త జంటకు కానుకలు ఇవ్వాలనుకున్న వారు.. గూగుల్ పే లేదా ఫోన్‌పే ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే వీలు కల్పించారు. అయితే పెళ్లికి వచ్చిన 30 మంది అతిథులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. వెడ్డింగ్ ప్రజెంట్‌గా నగదు ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్‌లను వాడుకున్నారు. ఆదివారం ఈ పెళ్లి వేడుక జరిగింది. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.