బైక్‌పై జంట రొమాన్స్‌.. వీడియో వైరల్.. పోలీసుల ఝలక్

దేశ రాజధానిలో రోడ్లపై ప్రేమ జంట రెచ్చిపోయింది. బైక్‌పై వెళ్తూ రొమాన్స్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  18 July 2023 1:30 PM GMT
Lovers, Bike Ride, Romance, Delhi,

 బైక్‌పై జంట రొమాన్స్‌.. వీడియో వైరల్.. పోలీసుల ఝలక్

ఈ మధ్యకాలంలో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నాయి. బహిరంగంగానే రొమాన్స్‌ చేస్తున్నారు. చుట్టూ జనాలు ఉన్నారు.. ఇబ్బంది పడతారు అని కూడా పట్టించుకోవడం లేదు. ఎవరుంటే మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో అయితే.. ఇలాంటి ఘటనలు చాలా చూశాం. తాజాగా దేశ రాజధానిలోనే రోడ్లపై ప్రేమ జంట రెచ్చిపోయింది. బైక్‌పై వెళ్తూ రొమాన్స్‌ చేశారు. ప్రమాకరంగా డ్రైవింగ్‌ చేశారు. వీడియో వైరల్‌ అవ్వడంతో పోలీసులు కూడా స్పందించారు.

ప్రేమ జంటలు బైక్‌ ట్రిప్‌లకు వెళ్లడం బాగా ఇష్టపడుతుంటారు. నార్మల్‌గా ఉంటే ఏం కాదు కానీ.. వారి ప్రాణాలను రిస్క్‌ చేస్తూ స్టంట్స్‌ చేస్తున్నారు. ఢిల్లీలో రోడ్లపై ఓ జంట రెచ్చిపోయి ప్రవర్తించింది. యువతి బైక్‌ ట్యాంక్‌పై రివర్స్‌లో కూర్చొని ఉంది. యువకుడిని హగ్‌ చేసుకుని కూర్చొంది. ఇక బైక్‌ను వేగంగా నడుపుతూ సదురు యువకుడు ఇతర వాహనాదారులను భయాందోళనకు గురి చేశాడు. ఇదంతా వెనకాలే కారులో వస్తున్న కొందరు వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా వీడియో వైరల్‌ అయ్యింది. ప్రేమ జంట వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసభ్యంగా ఇలా రోడ్లపై ప్రవర్తించడాన్ని తప్పు బడుతున్నారు. తల్లిదండ్రులను తలదించుకునేలా చేయొద్దంటూ సూచిస్తున్నారు. వీడియో అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసుల వరకు చేరింది.

దీనిపై స్పందించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలసీఉలు.. 'ధన్యవాదాలు ఇలాంటి ట్రాఫిక్‌ ఉల్లంఘన ఘటనలు ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ సెంటినల్‌ యాప్‌లో నివేదించాలని అభ్యర్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు'. దాంతో.. పలువురు నెటిజన్లు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. పబ్లిక్‌ ప్లేసుల్లో ఇలాంటి అశ్లీలత కలుషితం చేస్తుందని ఫిర్యాదులు చేస్తున్నారు. పైగా మహిళ హెల్మెట్‌ ధరించకుండా ఇలాంటి స్టంట్స్‌ చేస్తూ ప్రాణాలనే పణంగా పెడుతున్నారని.. ఇద్దరినీ అరెస్ట్‌ చేయాలంటూ కామెంట్స్‌ పెట్టారు. ఇలా బైక్‌పై రొమాన్స్‌ చేయడం యువత క్రేజీగా ఫీలవుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు పలు చోట్ల జరిగాయి.

Next Story