ఏంటీ 'లుక్‌ బిట్వీన్‌ కీబోర్డ్‌' ట్రెండ్‌

సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ పుట్టుకొస్తూ నెటిజన్లను ఉర్రూతలూగిస్తోంది. ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉన్న 'లుక్‌ బిట్వీన్‌ యువర్‌ కీ బోర్డ్‌' ట్రెండ్‌ కొత్తదేం కాదు.

By అంజి  Published on  24 April 2024 5:40 PM IST
Look between keyboard, internet, new trend, Social media

ఏంటీ 'లుక్‌ బిట్వీన్‌ కీబోర్డ్‌' ట్రెండ్‌ 

హైదరాబాద్: సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ పుట్టుకొస్తూ నెటిజన్లను ఉర్రూతలూగిస్తోంది. సోషల్ మీడియాలో ఇటీవల కీబోర్డ్‌లోని నిర్దిష్ట కీల మధ్య చూసే ఆసక్తికరమైన ట్రెండ్‌తో సందడి చేస్తోంది. ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉన్న 'లుక్‌ బిట్వీన్‌ యువర్‌ కీ బోర్డ్‌' ట్రెండ్‌ కొత్తదేం కాదు. 2021లో మేలో K - ON అనే యానిమేటెడ్‌ సిరీస్‌లో పాత్రను పరిచయం చేయడానికి 4Chan అనే వెబ్‌సైట్‌ ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టింది. లుక్‌ బిట్వీన్‌ T అండ్‌ O అంటూ 'YUI' అనే పాత్రను పరిచయం చేశారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ను నెటిజన్లు అందిపుచ్చుకున్నారు. ఎన్నికల వేళ ఈ ట్రెండ్‌ బాగా వైరల్‌ అవుతోంది.

ఢిల్లీ పోలీసుల నుండి స్విగ్గీ నుండి యూట్యూబ్ ఇండియా వరకు నెటిజన్లు, సంస్థలు లుక్‌ బిట్వీన్‌ ట్రెండ్‌తో తమ స్వంత మీమ్‌లను సృష్టించడం ద్వారా చేరడంతో ఈ ట్రెండ్ మరోసారి ట్రాక్షన్‌ను పొందింది. సోషల్ మీడియా వినియోగదారులు హాస్య ఉద్దేశ్యంతో ప్రియమైన పాత్రలు, సెలబ్రిటీలు లేదా పబ్లిక్ ఫిగర్‌ల ప్రారంభ అక్షరాలను హైలైట్ చేయడానికి దీన్ని వాడుతున్నారు. 'లుక్‌ బిట్‌వీన్‌ H అండ్‌ L ఆన్‌ యువర్‌ కీ బోర్డు' అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా మనం వాడే కీబోర్డుల్లో వాటి మధ్య లెటర్స్‌ 'JK' అని ఉంటాయి. అంటే దానర్థం జస్ట్‌ కిడ్డింగ్‌ అన్నమాట. ఇంటర్వ్యూయర్‌ చూపు ఎప్పుడూ X అండ్‌ B మధ్య (CV) ఉంటుందని ఓ వ్యక్తి పోస్ట్‌ చేశాడు.

Next Story