హగ్ కోసం పర్మీషన్ కోరిన చిన్నారి.. వీడియో వైరల్
Little Girl Asks Permission To Say Goodbye To Her Aunt.చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ముద్దుగా ఉంటుంది. వారి చిట్టి
By తోట వంశీ కుమార్
చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ముద్దుగా ఉంటుంది. వారి చిట్టి పొట్టి పలుకులు మనసుకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి. మనం బయటకు వెలుతుంటే.. వారు బయటకు వచ్చి మరీ మనకు టాటా చెబుతుంటుండడం మన ఇంట్లో సాధారణంగా జరుగుతుంటూనే ఉంటుంది. తాజాగా ఓ చిన్నారి చేసిన అలాంటి ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విదేశాలకు వెలుతున్న తన అత్తను కౌగిలించుకునేందుకు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆ చిన్నారి పర్మిషన్ అడిగిన వీడియో అది.
వివరాల్లోకి వెళితే.. ఖతార్‌లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ విదేశానికి వెలుతుంటే ఆమెకు సెండాఫ్ ఇవ్వడానికి ఆమె కుటుంబం విమానాశ్రయానికి వచ్చింది. ఆ మహిళ అందరికి వీడ్కోలు చెప్పి.. సెక్యూరిటీ చెక్ ఇన్ దాటింది. ఇంతలో ఓ చిన్నారి సెక్యూరిటీ పాయింట్ వద్దకు వచ్చి అక్కడ నిలుచున్న సెక్యూరిటీతో మా అత్తను కౌగిలించుకోవాలి పర్మిషన్ ఇవ్వండి అని అడిగింది. వారు కూడా ఆ చిన్నారి మాటకు కరిగిపోయి పర్మిషన్ ఇచ్చారు. వెంటనే ఆ చిన్నారి బుడి బుడి అడుగులతో అత్త వైపుకు వెలుతుండగా.. ఆ చిన్నారి రావడం చూసి పరుగున వచ్చిన ఆమె అత్త.. ఆ చిన్నారిని కౌగిలించుకుని ముద్దుల వర్షం కురిపించింది. ఇదంతా కప్తాన్ హిందుస్థాన్ అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.
కేవలం రెండు రోజుల వ్యవధిలో 5.85 లక్షల మంది చూశారు. ఇప్పటికే ఈ వీడియోను 62 వేల మందికి పైగా లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి వీడియో చూసేయండి.
She asked the officer permission to say goodbye to her aunt at the airport. pic.twitter.com/bcsb9rnxt6
— Kaptan Hindustan™ (@KaptanHindostan) October 14, 2021