చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ.. ఎగబడ్డ జనం
Litre of petrol free for buying fish worth Rs 500.కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారులు ఒడిదుడుకులను
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2021 7:25 AM GMTకరోనా మహమ్మారి కారణంగా వ్యాపారులు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. కరోనాకు ముందులా వ్యాపారం జరగడం లేదని అంటున్నారు. అందుకనే కస్టమర్లను ఆకరించేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అయితే.. అందరిలా ఒకటి కొంటే మరొకటి ఉచితం లాంటి ఆఫర్ ఇస్తే ప్రయోజనం పెద్దగా ఉండదని ఆలోచించిన ఓ వ్యాపారి.. పెట్రోల్ ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర వంద దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు చేసిన ప్రకటనతో ప్రజలు అతడి షాపు ముందు క్యూ కట్టారు. అయితే.. ఇక్కడే ఓ మెలిక కూడా ఉందండోయ్.. అది ఏంటంటే.. ఫ్రీగా పెట్రోల్ కావాలంటే ముందుగా చేపలు కొనాల్సిందే.. అది కూడా రూ. 500లకు పైగా చేపలను కొంటే లీటర్ పెట్రోల్ ఉచితంగా లభిస్తుంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మదురైకు చెందిన ఓ వ్యాపారి వినూత్న రాయితీ ఇచ్చాడు. తన వద్ద రూ.500 విలువ చేసే చేపలు కొన్న వారికి లీటరు పెట్రోల్ కూపన్‌ను ఉచితంగా ఇచ్చాడు. దీంతో పీపీకుళం ప్రాంతంలోని ఆ చేపల దుకాణానికి జనం ఎగబడుతున్నారు. టోకెన్‌లో పేర్కొన్న పెట్రోలు బంక్ వద్దకు వాహనంతో వెళ్తే లీటర్ పెట్రోలు ఉచితంగా పోస్తుండడం విశేషం. దీనిపై ఆ వ్యాపారి మాట్లాడుతూ.. గతంలో రోజువారీ వినియోగదారులు రూ.500 కంటే తక్కువ ధరకే చేపలు కొనేవారని.. ప్రస్తుతం రూ.500 కంటే ఎక్కువకు కొంటున్నారని చెప్పారు.