దేశంలోనే తొలిసారి.. తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్‌జెండర్ జంట
Kerala trans man gets pregnant couple to welcome their baby in March.కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ట్రాన్స్ జండర్ జంట
By తోట వంశీ కుమార్
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ట్రాన్స్ జండర్ జంట తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. వీరు పిల్లలను దత్తత తీసుకోవడమో, సరోగతి పద్దతిలోనే కనడం లేదు. పురుషుడిగా మారిన ఓ మహిళ గర్భవతిగా మారి బిడ్డను జన్మనివ్వబోతుంది.
కోజికోడ్‌లో జియా, జహద్‌లు నివసిస్తున్నారు. వీరిద్దరు గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పుట్టుకతో మగ అయిన జియా లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారుతోంది. అమ్మాయిగా జన్మించిన జహద్ కూడా లింగమార్పిడి చేయించుకుని అబ్బాయిగా మారుతున్నాడు. అయితే.. పిల్లలను కనాలని నిర్ణయించుకున్న వీరు బిడ్డ కోసం లింగ మార్పిడి ప్రక్రియను నిలిపివేశారు. జహద్ గర్భం దాల్చింది. ఫలితంగా దేశంలోనే గర్భం దాల్చిన తొలి ట్రాన్స్‌మెన్‌గా నిలిచింది.
జహద్ అబ్బాయిగా మారాలని అనుకోవడంతో ఆమె వక్షోజాలను వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఇప్పటికే తొలగించారు. అయితే.. గర్భసంచీ ఇంకా తొలగించకపోవడంతో జహాద్ గర్భం దాల్చి ఉండొచ్చునని వైద్యులు తెలిపారు. జహాద్ గర్భంతో ఉన్న ఫొటోలను ఆ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే తీరనున్నాయి అంటూ జియా పావెల్ ఇన్‌స్టాలో రాసింది. మార్చినెలలో వైద్యులు ప్రసవం డేట్ ఇచ్చారని, ఇక పుట్టే బిడ్డకు మిల్క్ బ్యాంక్ నుంచి సేకరించిన పాలను పడతామని చెప్పారు.