షాకింగ్‌.. ప‌దేళ్లుగా ప్రియురాలిని ఒకే గ‌దిలో దాచిన ప్రియుడు

Kerala man hid lover in his room for 10 years.ప‌దేళ్లుగా ఓ ప్రియురాలు, ప్రియుడితో క‌లిసి అత‌డి ఇంట్లోనే ఉంటోంది. అయితే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2021 7:01 AM GMT
షాకింగ్‌.. ప‌దేళ్లుగా ప్రియురాలిని ఒకే గ‌దిలో దాచిన ప్రియుడు

ప‌దేళ్లుగా ఓ ప్రియురాలు, ప్రియుడితో క‌లిసి అత‌డి ఇంట్లోనే ఉంటోంది. అయితే.. ఈ విష‌యం ఆ అబ్బాయి కుటుంబంలో ఎవ్వ‌రికి తెలీదు. ఆ రూమ్‌కు ఎటాచ్ బాత్రూమ్ కూడా లేన‌ప్ప‌టికి అన్ని సంవ‌త్స‌రాలు ఇంట్లో వారికి ఎలాంటి అనుమానం రాకుండా అత‌డు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. చివ‌రికి ఆ యువ‌కుడు క‌న‌ప‌డ‌కుండా పోవ‌డంతో అత‌డి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచార‌ణ‌లో దిమ్మ‌దిరిగే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లోని నెమ్మ‌ర పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈఘ‌ట‌న‌ జ‌రిగింది.

అయిరూర్ గ్రామంలో 2010 ఫిబ్ర‌వ‌రిలో 18 సంవ‌త్స‌రాలు ఉన్న ఓ యువ‌తి ఇంటి నుంచి పారిపోయింది. ఆ యువతి తల్లిదండ్రులు ఎక్కడెక్కడో గాలించారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆశలు వదిలేసుకున్నారు. కాల‌క్ర‌మంలో ప‌దేళ్లు గ‌డిచ‌పోయాయి. ఓ రోజు పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. 'మీ అమ్మాయి దొరికింది' అని చెప్పారు. తీరా వెళ్లే సరికి ఆ అమ్మాయితో పాటు మరో అబ్బాయి కూడా ఉన్నాడు. అతడ్ని చూసి షాకయ్యారు. ఎందుకంటే.. అతడు తమ పక్కింటి కుర్రాడే. ఆ అమ్మాయి మరెక్కడికో పోలేదు. ఇన్ని రోజులు ఆమె ప‌క్కింట్లోనే ఉంది అని తెలిసీ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

ఈ విష‌యం అబ్బాయి తల్లిదండ్రులకు కూడా తెలీదు. గ‌త ప‌దేళ్లుగా తాళం వేసి ఉన్న ఓ గ‌దిలో ఆమె నివ‌సిస్తోంది. ప్రియుడే ఆమె యోగ‌క్షేమాలు చూసుకునేవాడు. అన్న పానీయాలు తనే అందించే వాడు. తను గదిలో ఉంటే లోపల గడియ పెట్టుకునే వాడు. లేకపోతే.. బయట తాళం వేసేవాడు. అయితే.. ఆగ‌దికి అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ కూడా లేకపోవడంతో ఆ అమ్మాయి రాత్రి వేళ కిటికీ నుంచి బయటకు దూకి బాత్‌రూమ్‌కి వెళ్లేదట. ఇలా ప‌దేళ్లు గ‌డిచాయి. మూడు నెల‌ల కింద‌ట అత‌డు త‌న ప్రియురాలిని తీసుకుని ఇల్లు వ‌దిలి పారిపోయాడు. నెమ్మ‌ర స‌మీపంలోని కుగ్రామం విథాన్‌స్సెరీలో ఓ అద్దె ఇంట్లో ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఈ సారి అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రేమికులిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజ‌రు ప‌రుచ‌గా.. తాము క‌లిసి ఉంటామ‌ని యువ‌తి కోర్టుకు వెల్ల‌డించింది.

Next Story