శృంగారం కోసం బయటకు వెళ్లాలి.. ఈ-పాస్ కోసం విచిత్ర అభ్యర్థన.. పోలీసులు ఏం చేశారంటే..?
Kerala man applies for e-pass.దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడి కోసం చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్,
By తోట వంశీ కుమార్ Published on 15 May 2021 8:25 AM ISTదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడి కోసం చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూను విధించాయి. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఎవరైనా అర్జెంట్ పని మీద బయటకు వెళ్లాలనుకుంటే.. పోలీసుల నుంచి ఈ-పాస్ పొందాల్సిందే. అయితే.. కొద్ది మంది ఈ-పాస్ కోసం చెప్పే కారణాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి శృంగారం కోసం బయటకు వెళ్లాలనుకుంటున్నానని.. దయచేసి దాని కోసం తనకు ఈ-పాస్ ఇప్పించాలని పోలీసులను కోరాడు. తొలుత ఈ అభ్యర్థనను చూసి ఖంగు తిన్న పోలీసులు.. తరువాత సదురు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని ఓ వ్యక్తి ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దాంట్లో ఓ చిత్రమైన అభ్యర్థన చేశాడు. శృంగార కోసం బయటకు వెళ్లాలనుకుంటున్నాను. దాని కోసం నాకు ఈ-పాస్ ఇవ్వండి అంటూ ఆ వ్యక్తి పోలీసుల్ని కోరాడు. తొలుత ఖంగుతిన్న పోలీసులు.. తరువాత ఆ అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తి అడ్రస్‌ను కనుకున్నారు. అతడిని కన్నూరులోని ఇరినేవ్ గ్రామస్తుడిగా గుర్తించారు. వాలా పట్టణం పోలీసులు అతడి దగ్గరికి వెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకోచ్చారు. ఇలా ఎందుకు చేశావని అతడిని ప్రశ్నించారు.
అక్షర దోషం వల్ల తన అప్లికేషన్‌లో పొరపాటు జరిగినట్లు సదరు వ్యక్తి పోలీసులకు క్షమాపణ చెప్పాడు. ఇంగ్లీషులో 'six o clock' అని రాయాలని అనుకున్నానని, కానీ తన దరఖాస్తులో పొరపాటున 'sex' అని పడినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి క్షమాపణలను స్వీకరించిన పోలీసులు.. అనవసర కారణాలతో ఈ-పాస్ దరఖాస్తు చేసుకోవద్దు అంటూ అతన్ని రిలీజ్ చేశారు. బీహార్‌లోనూ ఓ వ్యక్తి కూడా చిత్రమైన కారణం చూపుతూ.. ఈ-పాస్ ఇవ్వాలని కోరాడు. మొటిమల చికిత్స కోసం వెళ్లేందుకు తనకు పాస్ ఇవ్వాలని అతను కోరాడు. దీన్ని బీహార్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.