అదృష్టం త‌లుపు త‌ట్టింది.. రూ.200 పెడితే.. ఏకంగా కోటిరూపాయ‌లు

Katihar plumber Mistry became millionaire.అదృష్టం ఎవ‌రిని ఎప్పుడు ఎలా వ‌రిస్తుందో తెలీదు. అదృష్టం త‌లుపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2021 2:35 AM GMT
అదృష్టం త‌లుపు త‌ట్టింది.. రూ.200 పెడితే.. ఏకంగా కోటిరూపాయ‌లు

అదృష్టం ఎవ‌రిని ఎప్పుడు ఎలా వ‌రిస్తుందో తెలీదు. అదృష్టం త‌లుపు త‌డితే రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడు కావ‌చ్చు. తాజాగా ఐపీఎల్(ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) ఓ ప్లంబ‌ర్ జీవితాన్నే మార్చేసింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ అయిన డ్రీమ్‌-11లో అత‌డు కోటి రూపాయ‌లు గెలుచుకున్నాడు. బీహార్‌కు చెందిన ఓ వ్య‌క్తి అక్టోబ‌ర్ 10న చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్-1 మ్యాచ్‌పై బెట్ వేయ‌గా.. అదృష్టం క‌లిసి వ‌చ్చి కోటీశ్వ‌రుడు అయ్యాడు.

వివ‌రాల్లోకి వెళితే.. క‌టిహార్ జిల్లా మ‌నిహారీకి చెందిన బ‌బ్లూ మండ‌ల్ హంస్‌వ‌ర్ గ్రామంలో ప్లంబ‌ర్ ప‌నులు చేసేవాడు. అత‌డితో పాటు ప‌నిచేసే ఓ వ్య‌క్తి.. డ్రీమ్ 11 యాప్ గురించి చెప్పాడు. అప్ప‌టి వ‌రకు బ‌బ్లూ కు ఆ యాప్ గురించి తెలీదు. స‌ద‌రు వ్య‌క్తే ఆ యాప్‌ను బ‌బ్లూ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశాడు. ఎలా ఆడాలో నేర్చించాడు. చాలా త‌క్కువ రోజుల్లోనే బ‌బ్లూకు అదృష్టం త‌లుపు త‌ట్టింది. ఈ న‌గ‌దుతో అప్పులు తీర్చి మంచి ఇల్లు క‌ట్టుకుంటాన‌ని, కొంత మొత్తాన్ని దేవాల‌యానికి విరాళంగా ఇస్తాన‌ని చెబుతున్నాడు.

'నాతో పని చేసే ఓ వ్య‌క్తి నాకు డ్రీమ్ 11 యాప్ గురించి చెప్పాడు. అప్ప‌టి వ‌ర‌కు దాని గురించి నాకు తెలీదు. అత‌డే నా ఫోన్‌లో ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. కొద్దిరోజులుగా నేను ఆ యాప్ వాడ‌డం మొద‌లుపెట్టా. ఫ‌స్ట్‌ రూ.200 పెట్టాను. ఏకంగా కోటీ రూపాయ‌లు వచ్చాయి. ప‌న్నుల రూపంలో రూ.30ల‌క్ష‌లు పోగా.. రూ.70ల‌క్ష‌లు వ‌చ్చాయి. అప్పులు తీర్చి మంచి ఇళ్లు క‌ట్టుకుంటా. దేవాల‌యానికి కొంత విరాళం ఇస్తా.. అని బ‌బ్లూ మీడియాతో చెప్పుకొచ్చాడు.

Next Story