పెళ్లిలో క‌ట్నం ఇవ్వ‌డం ఆన‌వాయితీ. ఇప్పుడంటే వ‌ధువు త‌రుపువారు వ‌రుడికి క‌ట్నం ఇస్తున్నారు కానీ.. పూర్వకాలంలో వ‌ధువుకు వరుడి త‌రుపు వారు క‌ట్నం ఇచ్చే ఆనవాయితీ ఉండేది. ఈ సంప్ర‌దాయం ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉంది. దానినే మోహోర్ అని పిలుస్తారు. ప‌శ్చి బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో క‌ళ్యాణి విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుతున్న మెయినా ఖాటూన్ అనే మ‌హిళ చేసిన ప‌నిని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.

మెయినా ఖాటూన్‌కు ఇటీవ‌లే వివాహాం అయింది. మైనార్టీ ఆధిపత్యం ఉండే ఏరియాలో 24 ఏళ్ల వధువు తనకు వరుడి తరపున ఇచ్చే కట్నం 'మహర్' (బెంగాలీలో 'మోహోర్') వద్దని దానికి బదులుగా పుస్తకాలు ఇవ్వాలని కోరింది. అది విన్న వరుడి కుటుంబం తొలుత ఆశ్చర్యపోయింది. ఆ తరువాత అర్థం చేసుకుని తమ కోడలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. అలా ఆమె కోరిన పుస్తకాలను బహుమతిగా అందించి గత సోమవారం (ఫిబ్రవరి 1,2021) మొయినా సొంత గ్రామమైన కిద్దేర్పోర్‌లో వివాహం జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పెళ్లి తర్వాత వధువు తరపు కుటుంబ సభ్యులంతా పుస్తకాలతో కనిపించారు. వధువుకు ఇచ్చిన పుస్తకాల్లో బెంగాలీ ఖురాన్, రవీంద్రనాథ్ ఠాకూర్, నజ్రుల్ ఇస్లామ్, విభూతిభూషణ్ బంధోపాధ్యాయ్ రచనలు ఉన్నాయి. మైనార్టీ ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో ఓ ఆడపిల్ల అటువంటి నిర్ణయం తీసుకుందని తెలిసిన అందరూ ప్రశంసించారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story