ఆన్‌లైన్‌లో పెళ్లి.. ఇంటికే భోజ‌నం.. నెటింట్లో పెళ్లి కార్డు వైర‌ల్‌

Indian couple delivered their wedding food to guests. పెళ్లి చేసి చూడు.. ఇళ్లి క‌ట్టి చూడు అన్నారు పెద్ద‌లు. మాన‌వ‌

By Medi Samrat  Published on  12 Dec 2020 6:20 AM GMT
ఆన్‌లైన్‌లో పెళ్లి.. ఇంటికే భోజ‌నం.. నెటింట్లో పెళ్లి కార్డు వైర‌ల్‌

పెళ్లి చేసి చూడు.. ఇళ్లి క‌ట్టి చూడు అన్నారు పెద్ద‌లు. మాన‌వ‌ జీవితంలో పెళ్లికి అంత ప్రాధాన్య‌త ఉంది. ఎవ‌రి తాహ‌తుకు త‌గ్గ‌ట్లు వారు పెళ్లిళ్లు చేసుకుంటారు. ఐదు రోజుల పెళ్లి, ఏడు రోజుల పెళ్లి ఇలా.. రకరకాలుగా నిర్వహిస్తారు. ఇక‌పోతే.. పెళ్లి భోజనానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది భోజనాల దగ్గరే తమ స్టేటస్‌ను చూపిస్తారని చెప్పుకుంటారు. రకరకాల వెరైటీలతో అతిథుల నోరూరే వంటకాలతో భోజనాలు వడ్డిస్తారు. అయితే.. క‌రోనా పుణ్య‌మా అని అదంతా గ‌తం. మొత్తం ఆడంబ‌రాల‌కు బ్రేక్ ప‌డింది. చాలా త‌క్కువ మంది బంధువుల స‌మ‌క్షంలో పెళ్లిళ్లు చేసుకోవాల్సి వ‌స్తుంది. అయితే.. ఓ జంట త‌మ వివాహాన్ని వెరైటీగా చేసుకోవాల‌ని అనుకున్నారు. వారి పెళ్లి ప‌త్రిక ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.



ఇంత‌కీ ఆ వెడ్డింగ్ కార్డులో ఏముందంటే..? మీరు మా పెళ్లికి రావాల్సిన అవ‌స‌రం లేదు. కేవ‌లం ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వండి చాలు. ఏ స‌మ‌యంలో అనేది ముందుగానే చెప్పారు. ఆ త‌రువాత వివాహా వింధు భోజ‌నం మీ ఇంటికే పార్సిల్‌లో పంపిస్తాం. మీ ఇంట్లో ఎంత మంది ఉంటే.. అంత‌మందికి అంటూ రాసుకొచ్చారు. అంతేనా.. భోజనంలో ఏఏ వంట‌కాలు ఉంటాయో.. వాటిని మెనూను కూడా ఆ వివాహా ఆహ్వ‌న ప‌త్రిక‌కు జ‌త చేశారు. ఇక పెళ్లి రోజున చెప్పిన‌ట్లుగానే.. శుభలేఖ ఇచ్చిన ప్రతి ఇంటికీ విందు భోజనం పార్శిల్‌ కూడా పంపించారు. బాగుంది క‌దా.. ఐడియా.. న‌చ్చితే.. మీరు ఫాలో అవ్వండి.


Next Story