బిడ్డకు జన్మనిచ్చిన మగ గొరిల్లా.. అసలు విషయం తెలిసి అందరూ షాక్
ఆ గొరిల్లా మగ అనుకుని జూ సిబ్బంది భావించారు. అయితే ఆ గొరిల్లా ఇటీవల ఒక పిల్లకు జన్మనిచ్చింది. ఇది తెలిసి జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు.
By అంజి Published on 23 July 2023 4:46 AM GMTబిడ్డకు జన్మనిచ్చిన మగ గొరిల్లా.. అసలు విషయం తెలిసి అందరూ షాక్
ఆ గొరిల్లా మగ అనుకుని జూ సిబ్బంది భావించారు. అయితే ఆ గొరిల్లా ఇటీవల ఒక పిల్లకు జన్మనిచ్చింది. ఇది తెలిసి జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ఓహియోలోని కొలంబస్ జూలో ఈ ఘటన జరిగింది. అయితే విషయాన్ని మరింత లోతుగా పరిశీలించిన తర్వాత, ఆ గొరిల్లా నిజంగా ఆడదేనని గుర్తించారు. ఈ విషయాన్ని కొలంబస్‌లో జూ సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఆడ గొరిల్లాను ఇప్పటి వరకు మగ గొరిల్లాగా జూ సిబ్బంది భావించడంపై నెటిజన్స్ భీన్న రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఎలా పొరబడతారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ జూ యాజమాన్యం వివరణ ఇచ్చింది. తాజాగా పిల్లకు జన్మనిచ్చిన గొరిల్లా 2019 నుండి తన తల్లితో నివసిస్తోందని, అది అప్పటి నుంచి మగ అని తాము భావించామని పేర్కొంది. అయితే గురువారం గొరిల్లా సంరక్షణ బృందాన్ని పిలిపించి విషయం పరిశీలించగా, ఆ గొరిల్లా ఆడదేనని వారు గుర్తించారు.
సాధారణంగా గొరిల్లాలు యుక్తవయస్సులో ఉన్నప్పుడు అవి మగవా, ఆడవా అన్నది నిర్ధారించడం చాలా కష్టమని తెలిపారు. ఎనిమిదేళ్ల వయసు వచ్చిన తర్వాతే వాటి లింగత్వం గురించి తెలుస్తుందని తెలిపారు. 12 ఏళ్ల తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. మరోచోట పుట్టిన ఈ గొరిల్లా పిల్లగా ఉన్నప్పుడు జూకు తరలించారని, ఆ సమయంలో అది మగదా, ఆడదా అన్నది నిర్ధారించలేదని జూ తెలిపింది. అయితే ఈ గొరిల్లాకు పుట్టింది మాత్రం ఆడ పిల్లే అని స్పష్టం చేశారు. తల్లి గొరిల్లా తన బిడ్డను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. తల్లి, పిల్ల గొరిల్లాల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.