పెళ్లి రోజుని మరిచిపోయిన భర్త.. చెప్పు అందుకున్న భార్య
పెళ్లి రోజుని మరిచిపోయిన భర్తకు ఓ భార్య విధించిన శిక్ష ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 6:51 AM GMTపెళ్లి రోజుని మరిచిపోయిన భర్త.. చెప్పు అందుకున్న భార్య
పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఏం కాదు. కానీ పెళ్లి అయిన తరువాత ఖచ్చితంగా బాధ్యతగా ఉండాల్సిందే. ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవాలి. ఆయా రోజుల్లో ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సి ఉంటుంది. ఒక్కో సారి పని హడావుడిలో పడి ముఖ్యమైన తేదీలను మరిచిపోతుంటారు. అప్పుడు భార్యల అలకను పోగొట్టడం కష్టమైన పనే. ఓ భర్త తన పెళ్లి రోజుని మరిచిపోవడంతో అతడి భార్య అతడికి శిక్ష విధించింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబైలోని గోవండిలోని బగన్‌వాడిలో విశాల్ నాంగ్రే, కల్పన దంపతులు నివసిస్తున్నారు. 2018లో వీరి వివాహం జరుగగా.. విశాల్ ఓ కొరియర్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తుండగా కల్పన పుడ్ అవుట్‌లెట్‌లో పని చేస్తోంది. ఇటీవల వీరి వివాహా వార్షికోత్సవాన్ని విశాల్ మరిచిపోయాడు. దీంతో కల్పన ఆగ్రహించింది. రాత్రి తన తల్లిదండ్రులు, సోదరుడిని పిలిపించింది.
భర్త, అత్తతో వీరికి వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావడంతో కోపంతో ఊగిపోయిన కల్పన తన అత్తగారిని చెప్పుతో కొట్టింది. విశాల్ పై కల్పన తల్లిదండ్రులు, సోదరుడు దాడి చేశారు. అతడి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.
విశాల్, అతడి అమ్మ ఇద్దరు ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు విశాల్ భార్య, సోదరుడు మరియు అతని తల్లిదండ్రులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.