పెళ్లికి ముందే కొట్టిందా..? ఒంటి నిండా గాయాల‌తో వ‌రుడు.. ఫోటోలు వైర‌ల్

Groom wears only a pair of shorts. ఓ పెళ్లి వేడుక‌కు సంబంధించి కొన్ని ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అందులో పెళ్లి కొడుకు ఒంటి నిండా గాయాల‌తో క‌నిపిస్తున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 12:50 PM IST
Indonesia wedding

పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో అతి ముఖ్య‌వేడుక‌. ఈ వేడ‌క‌ను ఎవ‌రి తాహ‌త్తుకు త‌గ్గ‌ట్లు వారు చేసుకుంటుంటారు. ఇక ఈ వేడుక‌లో అందిరి దృష్టి వ‌ధువు, వ‌రుడు‌పైనే ఉంటుంది. అందుక‌నే వ‌ధువు, వ‌రుడు ప్ర‌త్యేకంగా రెడీ అవుతారు. ఓ పెళ్లి వేడుక‌కు సంబంధించి కొన్ని ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అందులో పెళ్లి కొడుకు ఒంటి నిండా గాయాల‌తో క‌నిపిస్తున్నాడు. క‌నీసం చొక్కా లేకుండా కేవ‌లం షార్ట్ మాత్ర‌మే ధ‌రించి ఉండ‌గా.. వ‌ధువు మాత్రం చాలా చ‌క్క‌గా ముస్తాబైంది. చాలా మంది బంధువులు హాజ‌రైయ్యారు. అందులో కొంత మంది వీటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.


దీంతో ఈ ఫోటోలు చూసిన నెటీజ‌న్లు.. అయ్యో ఆ యువ‌కుడికి ఈ పెళ్లి ఇష్టం లేన‌ట్లుంది అందుక‌నే అత‌డిని కొట్టి మ‌రీ పెళ్లి చేస్తున్నారా..? అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా.. పెళ్లికి ముందే కాబోయే భార్య కొట్టిందేమో అని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోల‌పై ఆరా తీయ‌గా.. అస‌లు విష‌యం తెలిసింది. ఇండోనేషియాకు చెందిన దంప‌తుల‌విగా తేలింది. కాగా.. పెళ్లి కుమారుడు ఎందుకు అలా వ‌చ్చాడు అని పెళ్లి కుమారైను అడుగ‌గా.. ఆమె ఇలా చెప్పింది. ఈ వివాహం ఇద్ద‌రికి ఇష్ట‌మేన‌ని.. అయితే.. పెళ్లికి కొద్దిరోజుల ముందు నా భ‌ర్త పెట్రోల్ తీసుకురావ‌డం కోసం బ‌య‌టికి వెళ్లాడు. ఆ స‌మ‌యంలో అత‌డికి యాక్సిడెంట్ అయ్యింది. దాంతో అత‌డికి ఒళ్లంతా గాయాలు అయ్యాయి. క‌నీసం బ‌ట్ట‌లు వేసుకునే ప‌రిస్థితి కూడా లేదు. అయిన‌ప్ప‌టికి నాపై ఉన్న ప్రేమ‌తో ఇలా షార్ట్ మీదే వ‌చ్చి పెళ్లిచేసుకున్నాడ‌ని చెప్పింది.





Next Story