ఎన్నో ఆశ‌ల‌తో సంసార జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువ‌తికి తొలి రాత్రే వింత అనుభవం ఎదురైంది. భ‌ర్తతో ఊసులు చెప్పాల‌ని భావించ‌గా.. అత‌డు మాత్రం కంప్యూట‌ర్‌తో కుస్తీ ప‌ట్టాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు కానీ.. ఈ ఫోటోపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోను 'హోల్డ్‌ ఆన్‌ బేబీ'గా నెటిజన్లు పిలుస్తున్నారు.

బేబీ కొద్దిసేపు ఆగు.. ముందు నన్ను ట్విట్ట‌ర్ నోటిఫికేష‌న్స్ చెక్ చేసుకోనివ్వ‌ను అని ఒక‌రు కామెంట్ చేయ‌గా.. పెళ్లిలో నేను డ్యాన్స్ చేసిన ఫోటోల‌ను అప్‌లోడ్ చేసేవ‌ర‌కు ఆగు అని మ‌రొక‌రు కామెంట్ చేశారు. 'హోల్డ్‌ ఆన్‌ బేబీ మరో గంటలో డబుల్‌ గేమ్‌ వీక్‌ డెడ్‌లైన్‌ ముంచుకొస్తోంద'ని మరో యూజర్ కామెంట్లు చేశాడు. ఏదీ ఏమైనా ఆ వ‌రుడు చేసింది మాత్రం త‌ప్పేన‌ని అంటున్నారు నెటీజ‌న్లు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story