తలకెక్కిన నిషా.. వధువు మెడలో దండ వేయబోయి.. వీడియో వైరల్
Groom drunk during wedding video viral.ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ఏ చిన్న పాటి సంఘటన
By తోట వంశీ కుమార్
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ఏ చిన్న పాటి సంఘటన అయినా క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను చూస్తూ పొట్ట చెక్కలయ్యేలా పగలపడి నవ్వుతాం. అయితే ఇలాంటి వీడియోల వల్ల మనం అలాంటి పని చేయకూడదనే ఆలోచన కూడా మదిలో మెదులుతుంది. పీకల దాకా మద్యం తాగిన వరుడు పూలమాలను వధువుకు బదులు మరో మహిళ మెడలో వేయబోయాడు. తరువాత ఏం జరిగిందో చూస్తే..మీరు నవ్వుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా చాలా ప్రత్యేకమైనది. ఆరోజు చిరస్మరణీయంగా మర్చుకునేందుకు నేటి యువత అయితే చాలా ప్రణాళికలనే సిద్దం చేసుకుంటున్నారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం పెళ్లి అవుతుందన్నఆనందంతో చేశాడో.. మరి మిత్రుల బలవంతంగా పోశారో తెలీదు కానీ.. పెళ్లి రోజున పూటుగా మద్యం సేవించాడు. దండలు మార్చుకునే సమయం వచ్చింది. అప్పటికే నిషా మొత్తం తలెక్కింది. దండ తీసుకుని నిలబడడం అయితే.. నిలబడ్డాడు కానీ.. పెళ్లి కుమారై వేయాల్సిన దండ కాస్త.. పక్కన ఉన్న మహిళ మెడలో వేయబోయాడు.
గమనించిన సదరు మహిళ అతడిని అడ్డుకుంది. తన తప్పును గ్రహించిన పెళ్లి కొడుకు మళ్లీ పెళ్లి కుమారై మెడలో దండవేయబోయి డబేల్‌మనీ కింద పడ్డాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. తమ దైన శైలిలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.