బుల్లెట్ బండి కోసం వరుడి పట్టు.. షాకిచ్చిన వధువు
Groom asked for bullet bike in dowry.వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇదీ ఇటీవల వచ్చిన ఓ తెలుగు మూవీలోని పాట. బాగా
By తోట వంశీ కుమార్ Published on 30 May 2021 1:45 PM ISTవాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇదీ ఇటీవల వచ్చిన ఓ తెలుగు మూవీలోని పాట. బాగా పాపులర్ కూడా అయ్యింది. బుల్లెట్ బైక్ అంటే అంతే మరీ. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికి ఈ బండి అంటే మహా మోజు ఉంటుంది. అందరూ తెగ ఇష్టపడుతుంటారు. ఆ బండి అంటే రాజసం.. రాయల్ లుక్ ఉంటుంది. సౌండ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ బుల్లెట్ బండి గురించి ఎందుకు చెబుతున్నా అని అంటారా..? అక్కడికే వస్తున్నా ఆగడండి. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో బుల్లెట్ బండి కారణంగానే ఓ పెళ్లి ఆగిపోయింది.
వివరాల్లోకి వెళితే.. పర్తాపూర్ గ్రామానికి చెందిన ఖలీల్ ఖాన్ కుమారై కుల్సుమ్‌కు జీషన్ ఖాన్ అనే యువకుడితో వివాహాం నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. రెండు రోజుల క్రితం బరాత్ పెట్టుకున్నారు. బరాక్ కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే.. అప్పుడు వరుడు తనకు బుల్లెట్ బండి కావాలని పట్టుబట్టాడు. లాక్‌డౌన్ కావడంతో వెంటనే ఇవ్వలేమని వరుధు తరుపు వారు చెప్పగా.. బండి ధర రూ.2.30లక్షలు అయినా చెల్లించాలని పట్టుబట్టాడు.
చేసేది ఏమీ లేక.. ఏలాగోలా ఆ మొత్తాన్ని వధువు తండ్రి ఖలీల్ ఏర్పాటు చేయగలిగాడు. కానీ.. కొద్ది సేపటికే ఆయన అనారోగ్యం పాలైయ్యాడు. దీంతో వధువు కుల్సుమ్ తాను ఈ వివాహాం చేసుకునేది లేదని పట్టుబట్టింది. నిశ్చితార్థం సమయంలోనూ కట్నకానుకల గురించి మాట్లాడుకోలేదని.. ఇప్పుడు ఇదంతా ఏమిటని మండి పడింది. ఆమె తండ్రి సహా ఎవరూ ఎంత చెప్పినా.. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. దీంతో చివరకు వారి పెళ్లి రద్దు అయ్యింది.