రాత్రి ఒంట‌రిగా వెలుతున్న యువ‌తి.. చుట్టుముట్టిన కుక్క‌లు.. డ్యాన్స్.. వీడియో వైర‌ల్‌

Girl Dance On The Road In Front Of The Dogs.రాత్రి స‌మయంలో మీరు న‌డుచుకుంటూ వెలుతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2021 6:42 AM GMT
రాత్రి ఒంట‌రిగా వెలుతున్న యువ‌తి.. చుట్టుముట్టిన కుక్క‌లు.. డ్యాన్స్.. వీడియో వైర‌ల్‌

రాత్రి స‌మయంలో మీరు న‌డుచుకుంటూ వెలుతున్నారు. ఇంత‌లో ఓ కుక్క‌ల గుంపు మిమ్మ‌ల్ని వెంటాడింది. ఆ స‌మ‌యంలో మీరు ఏం చేస్తారు..? ఆ ఏం చేస్తా.. కుదిరితే ప‌క్క‌న ఉన్న రాయిని లేదా క‌ర్ర‌ని తీసుకుని వాటిని త‌రిమికొడుతాం లేదా వాటి కంటే వేగంగా ప‌రుగులు తీస్తాం. లేదా అలానే చూస్తూ నిలుచుట్టాం అంటారా. అయితే.. ఓ యువ‌తికి ఇలాంటి సంద‌ర్భ‌మే ఎదురైంది. ఆ యువ‌తి చేసిన ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ ఘ‌ట‌న ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు కానీ.. ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఒక్కసారిగా గ్రామ సింహాలు(కుక్క‌లు) కనిపించాయి. ఆ యువతిని చుట్టుముట్టాయి. వెంటనే ఆ అమ్మాయి డ్యాన్స్ మొదలు పెట్టింది. అమ్మాయి డ్యాన్స్ చేయడాన్ని చూసి కుక్కలు కూడా ఆశ్చర్యపోయాయి. "జబ్ తక్ హై జాన్ మెయిన్ నాచుంగి" పాట నేపథ్యంలో వీడియోతో ప్లే అవుతోంది.

ఈ వీడియోని IPS ఆఫీసర్ రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. జనరల్‌గా తమ ముందు చిందులు తొక్కితే... కుక్కలు భయపడి కరుస్తాయి లేదా అరుస్తాయి. ఇక్కడ మాత్రం ఆమె డాన్స్ వేస్తుంటే... ఆశ్చర్యంగా చూశాయే తప్ప ఏమీ అనలేదు. ఎందుకంటే... అవి షోలే సినిమాలో విలన్ లాగా చెడ్డవి కావు. విశ్వాసం ఉన్న మూగ జీవాలు. ఈ కుక్కలు డాన్స్ లవర్స్ అయి ఉంటాయని రూపిన్ శర్మ అభిప్రాయపడ్డారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story