వామ్మో.. పాలకూర ప్యాకెట్‌లో పాముపిల్ల.. వీడియో వైరల్
Finds Snake in lettuce bought.పాలకూర ప్యాకెట్‌ను తీసి చూసి షాకైయ్యారు. ఎందుకంటే.. అందులో ఓ పాము కనిపించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 18 April 2021 5:06 AM GMTఇంట్లో కావాల్సిన సామాన్లతో పాటు కూరగాయాల కోసం భార్యభర్తలు ఇద్దరూ సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. కావాల్సినవన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చారు. వాటిని సరుద్దామని బ్యాగులోంచి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు. పాలకూర ప్యాకెట్‌ను తీసి చూసి షాకైయ్యారు. ఎందుకంటే.. అందులో ఓ పాము కనిపించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ వైట్, అమేలియా నీట్ ఇద్దరూ భార్యాభర్తలు. ఇంటి సరుకుల కోసం ఇద్దరూ కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు, కొన్ని ఆకు కూరలు కూడా కొని తెచ్చుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత కూరగాయలను సర్దుతుండగా.. పాలకూర ప్యాకెట్‌లో పాము పిల్ల కనిపించింది.
దాంతో వారు షాక్‌కు గురైయ్యారు. వెంటనే తేరుకుని వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆ పామును తీసుకొని వెళ్లారు. కేవలం 7.8 అంగుళాల పొడవున్న ఆ పాము పిల్ల చాలా విషపూరితమైనదని.. ఒకవేళ కాటువేసి ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉండేవని వైర్స్ రెస్యూ సిబ్బంది తెలిపారు.
అలెక్స్ వైట్ ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ యాజమన్యానికి చెప్పాడు. పాము సూపర్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించిందో అనే విషయాన్ని పరిశీలించగా.. ఆస్ట్రేలియాలోని తూవూంబా నగరంలో ఒక ప్యాకింగ్ ప్లాంట్ నుంచి సిడ్నీకి 870 కిలోమీటర్లు పాము ప్రయాణం చేసినట్లు అధికారులు చెప్పారు. ప్యాక్ చేసిన ఉత్పత్తులలో మొదటిసారి పామును చూశామని స్థానిక సిబ్బంది తెలిపారు.
అలెక్స్ వైట్ ఇచ్చిన సమాచారం మేరకు అతని ఇంటి చేరుకున్న వైల్డ్ లైఫ్ అధికారులు ఆ పాము పిల్లను పట్టుకుని తీసుకెళ్లారు.దాంతో అలెక్స్ దంపతులు తాము ఏ మాత్రం అజాగ్రత్తగా పాలకూర ప్యాకెట్‌ను తెరిచినా పాముకాటుకు బలైపోయేవాళ్లమని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, సోషల్ మీడియాలో అలెక్స్ పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్‌లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.