ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. మన పక్కన ఉన్న చైనాలో తినడానికి కాదేమీ అనర్హం అంటూ.. అన్నింటీని తినడం చూశాం. యూరప్ వారసులకు అక్కడి పుడ్ సేఫ్టీ ఏజెన్సీ ఓ శుభవార్త చెప్పింది. ఓ వంటకాన్ని తినేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ వంటకాన్ని పెంపుడు జంతువులకు మాత్రమే పెడుతుండగా.. తాజాగా అక్కడి ప్రజలు తినేందుకు అనుమతి ఇచ్చింది. ఇంతకు అదేం గొప్ప వంటకం అని ఆలోచిస్తున్నారా..? మరీ అంతలా ఆలోచించకండి. అదీ వంటకం కాదు.. అక్షరాలా పురుగులు.
అవును మీరు చదివింది నిజమే.. పురుగులను తినేందుకు యూరోపియన్ యూనియన్ ఫుడ్ బోర్డ్ అనుమతి ఇచ్చింది. అయితే.. మామూలు పురుగులు కాదు. మీల్‌వర్మ్స్ అనే బీటిల్ జాతి పురుగులు. ఇప్పటివరకు ఈ పురుగులను యూరప్ లో పక్షులు, తొండలు వంటి జంతువులకు ఆహారంగా వాడేవారు. ఇప్పుడు ఈఎఫ్‌ఎస్‌ఏ ప్రకటనతో అక్కడ మనుషులు సైతం ఈ పురుగులను తినేందుకు అనుమతి లభించింది. మీల్‌వర్మ్స్ బీటిల్ జాతి పురుగుల్లో.. ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్, ఫైబర్స్ వంటి మనుషులకు కావాల్సిన అన్ని పోషక విలువలూ అత్యధికంగా ఉంటాయి. అందుకే వీటిని తినేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.