బీజేపీ ఎమ్మెల్యే స‌ల‌హా.. గోమూత్రం తాగండి.. క‌రోనాను జయించండి

Drink Cow Urine To Stop Coronavirus Spread. క‌రోనా మ‌హమ్మారి విస్తృతిని నిలువ‌రించ‌డానికి గో మూత్రం ఒక బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేస్తుంద‌ని.. దానిని ప్ర‌తిరోజు తాగాల‌ని ఓ ఎమ్మెల్యే పిలుపునిచ్చాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 3:09 AM GMT
cow urine

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. దీంతో ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, క‌ర్ప్యూలు విధిస్తున్నాయి. అన్ని ప్ర‌భుత్వాలు టీకా పంపిణీని వేగ‌వంతం చేశాయి. క‌రోనా మ‌హ‌మ్మ‌రి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. భౌతిక దూరం, మాస్కులు ధ‌రించ‌డం, శానిటైజ్ వంటి త‌ప్ప‌క పాటించాల‌ని చెబుతున్నారు. అయితే.. మ‌హమ్మారి విస్తృతిని నిలువ‌రించ‌డానికి గో మూత్రం ఒక బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేస్తుంద‌ని.. దానిని ప్ర‌తిరోజు తాగాల‌ని ఓ ఎమ్మెల్యే పిలుపునిచ్చాడు.

గో మూత్రాన్ని ఎలా తాగాలి.. ఎంత మొత్తం తీసుకోవాల‌ని వివ‌రిస్తూ ఆయన రూపొందించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. వివ‌రాల్లోకి వెళితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బైరియా నియోజ‌వ‌ర్గ‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ప్ర‌తిరోజు గోమూత్రం తాగ‌డం వ‌ల్ల క‌రోనాను నిలువ‌రించ‌వ‌చ్చ‌న‌ని అన్నారు. ఆరోగ్యానికి గో మూత్రం చాలా మంచిద‌ని.. తాను రోజులో 18 గంట‌లు ప‌నిచేయ‌డానికి అదే కార‌ణ‌మ‌ని చెప్పారు. రెండు లేదా మూడు గో మూత్రాన్ని ఒక గ్లాసు నీళ్ల‌లో క‌లుపుకుని తాగాల‌న్నారు. అయితే.. గో మూతాన్ని సేవించిన అర‌గంట వ‌ర‌కు ఎలాంటిది తిన‌డం కానీ, తాగ‌డం కానీ చేయ‌కూడ‌ద‌ని సూచించారు. తాను నిత్యం ఈ విధంగానే సేవిస్తున్నాన‌ని.. అందుక‌నే ఆరోగ్యంగా ఉన్నాన‌ని వివ‌రించారు. సైన్స్‌ను న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా.. ఆవు పంచ‌కంపై మాత్రం అపార‌మైన విశ్వాసం ఉన్న‌ద‌ని చెప్పారు.
Next Story