స్నానం నుంచి తప్పించుకునేందుకు కుక్క చేసిన ప్ర‌య‌త్నం.. వీడియో వైర‌ల్

Dog bath skip video viral. ఓ కుక్క య‌జ‌మాని స్నానం చేయించేందుకు యత్నించ‌గా.. స్నానం చేయ‌కుండా ఉండేందుకు చాలా తెలివిగా ప్ర‌వ‌ర్తించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2021 8:27 AM GMT
dog bath

సాధార‌ణంగా కొంత మంది చిన్న పిల్ల‌లు స్నానం చేయ‌మంటే మారాం చేస్తుంటారు. స్నానం చేయ‌కుండా ఉండేందుకు ఎన్నో సాకులు వెతుకుతుంటారు. అయితే.. ఇక్కడ ఓ కుక్క య‌జ‌మాని స్నానం చేయించేందుకు యత్నించ‌గా.. స్నానం చేయ‌కుండా ఉండేందుకు చాలా తెలివిగా ప్ర‌వ‌ర్తించింది. ఎలాంటి ఉలుకు ప‌లుకూ లేకుండా.. దాదాపు చ‌నిపోయిన దానిలా న‌టించింది. ఎన్ని సార్లు ఆ య‌జ‌మాని చేయితో లేపేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. క‌నీసం ఉలుకుప‌లుకూ లేకుండా ఉంది. అయితే.. ఆ కుక్క వేషాలు ఆయ‌జ‌మానికి తెలియ‌నివా చెప్పండి.. దాని నోటి ద‌గ్గ‌ర చేయి ప‌ట్టి లేప‌డంతో దాని బండారం కాస్త బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అయితే.. ఈ ఫ‌న్నీ ఇన్సిడెంట్ ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు గానీ.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. దీన్ని చూసిన నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది ఆ శున‌కం తెలివితేట‌ల‌ను ప్ర‌శంసిస్తుండ‌గా.. పాపం అది ఎంత‌గానో ప్ర‌య‌త్నించింది. అయిన‌ప్ప‌టికి దాని ఆట‌లు సాగ‌లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి వీడియో చూసేయండి
Next Story