ఫీల్డింగ్ చేసిన కుక్క.. వైరల్ వీడియో..!

Dog enters field during cricket match.తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు కొందరు ఫ్యాన్స్ ఎంతకైనా తెగిస్తారు. కొందరు

By అంజి  Published on  13 Sep 2021 4:30 AM GMT
ఫీల్డింగ్ చేసిన కుక్క.. వైరల్ వీడియో..!

తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు కొందరు ఫ్యాన్స్ ఎంతకైనా తెగిస్తారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా మ్యాచ్ మధ్యలో గ్రౌండ్‌లోకి దూకి తమ అభిమాన దైవాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ కుక్క మాత్రం ఏకంగా గ్రౌండ్‌లోకి దూకి మ్యాచ్ మధ్యలో ఫీల్డింగే చేసేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా వుమెన్స్ ఐర్లాండ్ టీ20 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓ కుక్క మైదానంలోకి పరిగెతుకుంటూ వచ్చింది.

బ్రెడీ క్రికెట్ క్లబ్, సివిల్ సర్వీస్ నార్త్ ఆఫ్ ఐర్లాండ్ క్రికెట్ క్లబ్‌కు మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. సీఎస్‌ఎన్‌ఐ బ్యాటర్ కొట్టిన బంతిని ఫీల్డర్ పట్టుకుని కీపర్‌కు విసిరివేశాడు. అతడు బ్యాట్‌మెన్‌ను అవుట్‌ చేసే ప్రయత్నంలో బంతిని వికెట్లకు విసిరాడు. అది వికెట్లకు తగలకపోవడంతో, అదే సమయంలో గ్రౌండ్‌లోకి ప్రవేశించిన కుక్క ఆ బంతిని పట్టుకుని పరుగులు పెట్టింది. అప్పటికే దానిని వెంబడించిన యజమాని, ఆ కుక్క నోటి నుండి బంతిని తీసి అక్కడున్న ప్లేయర్‌కు అందించాడు. తర్వాత కుక్కను అక్కడి నుండి తీసుకొని గ్రౌండ్‌ బయటకు వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న కామెంటరీ బిగ్గరగా నవ్వారు. దీంతో కొంత సమయం మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.

Next Story