మండపంలోకి వస్తూ ఆగిపోయిన వధువు.. ఏం జరిగిందంటే..?
Desi Bride Refused to Enter Wedding Hall As Her Chosen Entry Song Wasn't Played.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2021 10:56 AM ISTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అందమైన వేడుక. దీన్ని ఎప్పటికీ గుర్తుండే మధుర జ్ఞాపకంగా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. తమకు నచ్చినట్లు ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అయితే.. అన్ని సార్లు మనకు నచ్చినట్లు జరగవు కదా.. ఒక్కొసారి మనం అనుకోని విధంగా కూడా వివాహం జరుగుతుంటుంది. సరిగ్గా.. ఈ పెళ్లికూతురికి ఇలాగే జరిగింది. దీంతో తాను మండపంలోకి రానని భీష్మించుకుని కూర్చుంది. తాను అనుకున్నట్లు జరిగితేనే పెళ్లిపీటలు ఎక్కుతానని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ పెళ్లి కూతురు ఎందుకు రానందో తెలిసి అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు.
అసలు ఆ వీడియోలో ఏముందంటే.. మండపం అంతా బంధువులతో నిండిపోయి సందడిగా ఉంది. అందంగా అలంకరించుకుని చిరునవ్వులు చిందిస్తూ.. బంధువులతో కలిసి మండపంలోకి వధువు వస్తోంది. అయితే.. సడెన్‌గా ఆగిపోయింది. పక్కన ఉన్నవారు ముందుకు నడవాలని కోరగా.. నిరాకరించింది. ఏమైంది అని అడుగగా.. తన ఎంట్రీ సమయంలో తాను కోరిన పాట రావడం లేదని, ఆ పాట వచ్చే వరకూ తాను మండపంలోకి రాబోనని తేల్చేసింది. పక్కన ఉన్న వారు సర్ది చెప్పడంతో చివరకు చిరునవ్వులు చిందిస్తూ పెళ్లి పీటలు ఎక్కింది.
మండపంలోకి తన ఎంట్రీ సమయంలో ఏ పాట కావాలో ఆ వధువు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుందట. అయితే ఆమె వచ్చేటప్పుడు ఆ పాట రాలేదు. దీంతో కోపం తెచ్చుకున్న ఆ అమ్మాయి.. మండపంలోకి రావడానికి నిరాకరించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.