చిరుతిళ్లను దొంగిలిస్తూ పట్టుబడ్డ చిన్నారి.. వీడియోలు వైరల్

Dad Catches Daughter Stealing Food Video viral.సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు మనకు కనిపిస్తూ ఉంటాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 3:30 PM GMT
చిరుతిళ్లను దొంగిలిస్తూ పట్టుబడ్డ చిన్నారి.. వీడియోలు వైరల్

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్నే మనకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన ఫన్నీ కంటెంట్ లో ఇది కూడా ఒకటి. పిల్లి వీడియోల నుండి పిల్లల చేష్టల వరకు కొన్ని వీడియోలు మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. చిన్న పిల్లల వీడియోలకు భారీగా పాపులారిటీ అన్నది ఉంటుంది. ఆన్‌లైన్‌లో కనిపించే స్వీట్ బేబీ కంటెంట్‌కు అంతు లేదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఖాతాను చూశాము.. అందులో ఓ చిన్నారి వీడియోలు ఉన్నాయి. ఆమె తన తండ్రికి తెలియకుండా కొన్ని స్నాక్స్ దొంగిలించి పట్టుబడింది.


@snackbandits_dad అనే అకౌంట్ లో వీడియోలు ఉన్నాయి. అవి కొన్ని వేల వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఈ అకౌంట్ లోని వీడియోలలో ఓ చిన్నారి స్నాక్స్ ను దొంగిలిస్తూ అడ్డంగా దొరికిపోవడం చూడొచ్చు. ఎక్కడ దాచినా సరే ఆ పాప చిరుతిళ్లను దొంగిలిస్తూ ఉందట.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా దాచిపెడుతూ కూడా ఉండేది.. అలా ఆమె తండ్రి చేతికి దొరికినప్పుడు ఆమె నవ్వి, పెట్టెను పడేసి కెమెరా వైపు అందంగా చూసింది. డోరిటో చిప్స్ నుండి బియ్యం క్రిస్పీల వరకు, చిన్నారి అన్నింటినీ దాచిపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చిరుతిళ్లను ఎక్కడ దాచి పెట్టినా దొంగిలిస్తోంది తన కుమార్తె అంటూ ఆ ఖాతాలో పలు వీడియోలను పోస్ట్ చేశారు.

Next Story