ప్ర‌స్తుతం దేశంలో పెట్రోలు, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు కొండెక్కుతున్నాయి. గ‌త ప‌ది రోజులుగా పెట్రోలు ధ‌ర‌లు పెరుగుతూ.. సెంచ‌రీకి చేరుతుండ‌గా.. గ‌త మూడు నెల‌ల్లో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.200పైగా పెరిగింది. దీంతో సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు నిర‌సిస్తూ.. నూత‌న వ‌ధూవ‌రుల‌కు పెళ్లి కానుక‌గా వారి ఫ్రెండ్స్ ఓ వినూత్న‌ గిప్ట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


చెన్నైకు చెందిన కార్తిక్‌, శ‌ర‌ణ్య వివాహా వేడుక వంగ‌రంలోని ఓ క‌ల్యాణ మండ‌పంలో ఘ‌నంగా జ‌రిగింది. పెళ్లికి హాజ‌రైన వ‌రుడి స్నేహితులు.. నూత‌న దంప‌తుల‌కు ఐదు లీటర్ల పెట్రోలు, గ్యాస్ బండను ఇచ్చారు. అలాగే, ఉల్లిపాయలతో చేసిన దండను వారి మెడలో వేశారు. న‌వ దంప‌తుల‌తో పాటు వివాహ వేడుక‌కు వ‌చ్చిన వారంతా ఈ బ‌హుమ‌తులు చూసి న‌వ్వు ఆపుకోలేక‌పోయారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


తోట‌ వంశీ కుమార్‌

Next Story