పెళ్లికి హాజ‌రైన అతిధుల‌కు వింత అనుభం.. అంట్లు తోమించారు

Couple asks wedding guests to clean dishes.పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో మ‌ధుర‌మైన జ్ఞాప‌కంగా ఉంటుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 4:39 AM GMT
పెళ్లికి హాజ‌రైన అతిధుల‌కు వింత అనుభం.. అంట్లు తోమించారు

పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో మ‌ధుర‌మైన జ్ఞాప‌కంగా ఉంటుంది. ఇక మ‌న‌దేశంలో వివాహాల‌కు ఓప్ర‌త్యేక స్థానం ఉంది. మ‌న ద‌గ్గ‌ర‌.. బంధువులు, స్నేహితులు పెళ్లి ప‌నుల్లో సాయం చేస్తుంటారు. వివాహం జ‌రిగేంత వ‌ర‌కు చేదోడు వాదోడుగా ఉంటారు. ఇప్ప‌టికి చాలా చోట్ల ఈ సాంప్ర‌దాయం కొన‌సాగుతోంది. ఇక పెళ్లికి వ‌చ్చిన అతిధుల‌ను ఎంతో మ‌ర్యాద‌గా చూసుకుంటుంటారు. అయితే.. విదేశాల్లో జ‌రిగే పెళ్లిళ్ల‌లో ఎక్కువ భాగం మాత్రం క్యాటరింగ్ వారికి.. ఈవెంట్ ఆర్గనైజర్లకు ఆ పని అప్పగించి చేతులు దులుపేసుకుంటున్నారు.

అమెరికాలో ఓ పెళ్ళికి వెళ్లిన అతిధులకు వింత అనుభవం ఎదురైంది. అతిథుల చేత అంట్లు తోమించార‌ట‌. నూతన వధూవరులు ఇద్దరూ తమ పెళ్ళికి వచ్చిన అతిధుల చేత వంట, క్యాటరింగ్ నుండి చివరికి అంతా అయ్యాక పాత్రలు కడిగించడం వరకు అన్నీ చేయించారట. ఆపెళ్లికి వెళ్లిన ఓ మ‌హిళా ఈ ఘ‌ట‌న‌తో బాగా ఫీలైపోయింది. ఇంటికి వ‌చ్చి అక్క‌డ జరిగిన విష‌యాల‌ను రెడ్డిట్ సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో రాసుకొచ్చింది. వధూవరులు పెళ్ళికి పిలిచి అతిధులను ఇలా అవమానించారు అంటూ తన బాధను కోపాన్ని వ్యక్తం చేసింది. ప్ర‌స్తుతం ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నిజానికి అమెరికాలో వర్క్ డిగ్నిటీ ఉంటుంది. అంటే ఏ పని చేసినా చులకనగా చూడడం చాలా అరుదు అంటుంటారు. కానీ పెళ్లిల్లో పని అంటే మాత్రం అమెరికన్లకు మా చెడ్డ చిరాకు.

అయితే.. ఆ కొత్త జంట ఇలా చేయ‌డానికి ఓ కార‌ణం ఉంద‌ట‌. ముందుగా పెళ్లికి అనుకున్న బడ్జెట్ ఎక్కువైపోవడంతోనే ఈ అమెరికన్ జంట ఈ విధంగా అతిధులను ఇబ్బంది పెట్టారట. నిజానికి ఈ పెళ్లిలో వంటలు కూడా అతిధులందరికీ సరిపోలేదని ఆ బాధిత మహిళే వాపోయింది. దీనిపై నెటిజ‌న్లు ఫ‌న్నిగా కామెంట్లు పెడుతున్నారు.

Next Story