ఎప్పుడు చనిపోతామో చెప్పేస్తుందట
Canadian researchers build end-of-life predictor tool to support palliative care.మరణం.. ఎప్పుడు ఎలా వస్తుందో
By తోట వంశీ కుమార్ Published on 10 July 2021 5:26 AM GMTమరణం.. ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలీదు. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు. మనం ఎప్పుడు చనిపోతామో దాదాపుగా ఎవ్వరికి తెలీదు. ఏదైన ప్రాణాంతక వ్యాధులు ఉన్నా కూడా ఫలానా సమయంలోనే చనిపోతాం అని చెప్పడం కష్టమే. అయినా.. ఇప్పుడు చనిపోవడం గురించి ఎందుకు అని అంటారా..? అక్కడికే వస్తున్నా ఆగండి. మనం ఎప్పడు చనిపోతాయో చెబుతామని అంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు. అవునండి మీరు చదివింది నిజమే. ఎవరు ఎప్పుడు మరణిస్తారో చెబుతారట. అయితే.. ఇది అందరికి కాదట.. కేవలం వృద్దులు మాత్రమే ఎప్పుడు చనిపోతారో కచ్చితంగా చెప్పగలం అని అంటున్నారు.
అందుకోసం ఓ క్యాలుకులేటర్‌ను కూడా రూపొందించారు. రిస్క్ ఎవాల్యూషన్ ఫర్ సపోర్ట్ : ప్రొటెక్షన్ ఫర్ ఎల్డర్ లైఫ్ ఇన్ ది కమ్యూనిటీ టూల్ టూల్ను వారు కనుగొన్నారు. వయో వృద్దుల కోసం దీనిని కనిపెట్టారు. ఇదివారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్నది చెబుతుంది. అయితే.. వయోవృద్ధులు కొన్ని వివరాలు సమర్పించాలి. గతంలో ఏదైనా స్ట్రోక్ లాంటి వ్యాధులకు చికిత్స తీసుకున్నారా, గత మూడు నెలల నుంచి రోజువారి కార్యకలాపాలు, కాలకృత్యాలు సక్రమంగా చేస్తున్నారా అన్న వివరాలు ఇవ్వాలి. అలాగే వాంతులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, హఠాత్తుగా బరువు తగ్గడం, డీ హైడ్రేషన్ లాంటివి ఎదురవుతున్నాయా అన్న వివరాలను నమోదు చేయాలి. ఈ వివరాలను ఒక్కసారి నమోదు చేస్తే.. వీటి సాయంతో వారి మరణాన్ని అంచనా వేస్తుంది ఈ క్యాలుకులేటర్.
2007 నుంచి 2013 మధ్య ఒంటారియోలో మృతి చెందిన 4,91,000 మంది వృద్ధుల చివరి ఆరు నెలల పరిస్థితులు, స్థితిగతుల ఆధారంగా ఆ రెస్పెక్ట్ క్యాలుకులేటర్ పని చేస్తుంది. ఎంటర్ చేసిన వివరాల ఆధారంగా.. దానిలో ఉన్న డేటాతో సరిపోల్చి.. ఆ వృద్దుడు ఎప్పుడు మరణిస్తాడనే విషయాన్ని అంచనా వేస్తుంది. అయితే.. దీనిని ఎందుకు కనిపెట్టారంటే.. వృద్దులు చివరి రోజుల్లో తమ కుటుంబ సభ్యులతో హాయిగా సంతోషంగా ఉండేందుకని అంటున్నారు.ఉదాహరణకు.. ఒకవేళ పేరెంట్ మరణించనున్నారని తెలిస్తే పిల్లలు సెలవులు పెట్టి వారితోనే ఎక్కువ సమయం గడపవచ్చు. అలాగే ఏదైనా చేయాలనుకున్న పని మిగిలి ఉంటే చేయవచ్చు. యాత్రలు కూడా ప్లాన్ చేసుకోవచ్చునని అని బ్రుయెరె రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ యామీ షూ చెబుతున్నారు.