వ‌రుడి కొంప‌ముంచి స్వీట్‌.. కోపంతో వ‌ధువు .. వీడియో వైర‌ల్‌

Bride showing attitude to groom.భార‌తీయ వివాహా సాంప్ర‌దాయాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో గొప్ప‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2021 6:34 AM GMT
వ‌రుడి కొంప‌ముంచి స్వీట్‌.. కోపంతో వ‌ధువు .. వీడియో వైర‌ల్‌

భార‌తీయ వివాహా సాంప్ర‌దాయాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో గొప్ప‌గా పేరుంది. ఇక పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ప్ర‌త్యేక‌మైన రోజు. ఆ రోజు జ‌రిగే వాటిని జ్క్షాప‌కంగా జీవితాంతం గుర్తుంచుకుంటాం. ఇటీవ‌ల చాలా మంది అంద‌రిలాకాకుండా ఏదో ప్ర‌త్యేక‌త ఉండేలా వివాహాం చేసుకుంటున్నారు. అయితే.. కొన్ని చోట్ల అవి చాలా ఫ‌న్నీగా మారిపోతున్నాయి. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వివాహానికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

వివాహ వేదిక‌పై వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ నిలుచొని ఉన్నారు. చుట్టూ బంధువుల‌తో అక్క‌డ కోలాహాల వాతావ‌ర‌ణం నెల‌కొంది. వారి ఆచారంలో భాగంగా వారిద్ద‌రూ ఒక‌రికొక‌రు స్వీట్లు తినిపించుకోవాలి. ముందుగా వ‌ధువు స్వీటు తినిపించాలి. దీంతో వ‌ధువు చేతిలో స్వీట్ తీసుకుని వ‌రుడికి తినిపించేందుకు సిద్ద‌మైంది. అయితే.. వ‌రుడు సిగ్గుప‌డ్డాడో లేదో అత‌నికి స్వీట్లు అంటే ఇష్టం లేదో ఏమో తెలీదు కానీ.. వ‌ధువు స్వీట్ అందిస్తుంటే.. అలాగే నిల‌బ‌డిపోయాడు. తినేందుకు ప్ర‌య‌త్నించ‌లేదు. త‌న చేతితో వ‌ధువు చేయిలోని స్వీటు తీసుకోవాల‌నుకున్నాడు. అయితే..వ‌ధువుకు స‌హ‌నం న‌శించిందో లేక ఇష్టం లేని వివాహం చేస్తున్నారో తెలీదు కానీ.. వ‌రుడు త‌టాప‌టాయిస్తుండ‌డంతో చేతిలోని స్వీట్‌ను కోపంతో విసిరిపారేసింది. దీంతో అక్క‌డ ఉన్న వారితో పాటు వ‌రుడు షాక్‌కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు కానీ.. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story