పెళ్లి కూతురు పుష్ అప్స్.. వీడియో వైరల్
Bride doing Push ups while wearing a heavy Lehenga.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు.
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2021 3:00 PM ISTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో జరుగుతున్న కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటుండగా.. మరికొన్ని ఆలోచనలు రేకెత్తించేలా ఉంటున్నాయి. ఇక పెళ్లి సమయంలో చేసే హంగామా, అనుసరించే విధానం కొత్తగా ఉంటున్నాయి. ఆ మధ్య పెళ్లి కూతురు సడెన్ దెయ్యంలాగా కనిపించిందని పెళ్లిపీటల మీద నుంచి పెళ్లి కొడుకు పారిపోయిన వీడియో వైరల్ అయింది. అదే విధంగా.. పెళ్లి రిసెప్షన్‌లో ఓ వ్యక్తి వధువుకు ముద్దు ఇవ్వడం మరో హైలైట్. తాజాగా పెళ్లి వేడుకలో సంప్రదాయ దుస్తులను ధరించిన వధువు పుష్ అప్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనా ఆరోరా అనే యువతి ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు. ఈమె రెగ్యులర్‌గా జిమ్ చేస్తూ తన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తుంటుంది. అయితే జులై నెలలో తన పెళ్లి వేడుకలో భాగంగా అనా.. ఎరుపు రంగులో ఉన్న లెహంగ – చోలీ ధరించింది. జ్యువెలరీని కూడా అలకరించుకుని.. పుష్ అప్స్ తీసింది. ఈ వీడియో మంగళవారం నుంచి వైరల్ అవుతోంది. ఇక అనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 81 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేస్తున్న కొన్ని వర్కవుట్స్ చూస్తే కుర్రాళ్ల మతిపోవాల్సిందే.
కాగా.. ఈ వీడియోపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఫిట్నెస్ను కాపాడుకోవడం ముఖ్యమని ఆమె సందేశమిచ్చిందని కొందరు ప్రశంసించగా.. వ్యాయామం చేసేందుకు ఈ వీడియో స్ఫూర్తిగా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి చేసేయండి