ఆఫీసులో ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఇక మీ సాలరీ కట్..!
Boss Puts Up Note Telling Employees To Stop Charging in The Office.ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఓ
By తోట వంశీ కుమార్ Published on 27 Nov 2021 7:18 AM GMTప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఓ భాగం అయ్యింది. సెల్‌ఫోన్ లేని వారంటూ దాదాపుగా ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. మనం ఎక్కడికి వెళ్లినా స్మార్ట్‌పోన్ ఉండాల్సిందే. అయితే.. ఛార్జింగ్ విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో పవర్ బ్యాంకులను కూడా తీసుకువెలుతుంటారు చాలా మంది. ఇలా పవర్ బ్యాంకు లేని వాళ్లు ఎక్కడ చార్జింగ్ అందులో ఉంటే అక్కడ సెల్‌ఫోన్లను చార్జింగ్ పెడుతుంటారు. ఆఫీసులు, రైళ్లు, బస్ స్టేషన్లలో చాలా మంది ఫోన్లు చార్జింగ్ పెడుతుండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే.. ప్రస్తుతం ఓ ఆఫీస్ బాస్(అధికారి) తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆఫీసులో ఎవరూ సెల్‌ఫోన్లను చార్జింగ్ పెట్టకూడదని ఆదేశించాడు. ఇలా చేయడం కరెంట్ దొంగిలించినట్లేనని తెలిపాడు. ఆ బాస్ ఎవరు.. ఇది ఏ ఆఫీసులో జరిగిందనేది క్లారిటీ లేదు కానీ.. ఇందుకు సంబంధించిన ఓ నోటీసు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఆపీసు ఉద్యోగులంతా సెల్‌ఫోన్లను స్విచ్చాఫ్ చేయాలని అందులో ఉంది. ఎవరైనా ఫోన్ చార్జింగ్ చేస్తూ కనిపించారంటే వారి జీతంలోంచి కొంత మొత్తాన్ని కట్ చేస్తామని అందులో హెచ్చరించారు.
కాగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గంటల తరబడి ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడూ సెల్‌ఫోన్ చార్జింగ్ తగ్గిపోతుందని.. అలాంటప్పుడు ఆఫీస్ కరెంట్ ఉపయోగించుకోవడంలో తప్పేంటని కొందరు వాదిస్తుండగా.. మరికొందరేమో ఆ బాస్ చేసింది కరెక్టేనని అంటున్నారు. పనిచేసేటప్పుడు మొబైల్ ఫోన్ల వాడకం వల్ల కొందరు పనిని సక్రమంగా చేయడం లేదని.. ఆ బాస్ తీసుకున్న నిర్ణయం సబబే అని అంటున్నారు.