బెంగాలీవాలా 'స్వీట్' ఐడియా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

Bengal Man Unique Way To Buy Sweets in lock down.దేశంలో క‌రోనా వైర‌స్‌ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2021 7:09 AM GMT
Bengal man sweets selling

దేశంలో క‌రోనా వైర‌స్‌ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో.. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ ను అమ‌లు చేస్తున్నాయి. ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాల కొనుగోలు కోసం ఉద‌యం కొంత స‌మ‌యం వెసులు బాటు క‌ల్పిస్తున్నాయి. ఇక అత్య‌వ‌స‌ర ప్ర‌యాణాల కోసం ఈ-పాసులు ఇస్తున్నారు. అయితే.. కొంత‌మంది మాత్రం ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తూ.. పోలీసుల‌ను ఇబ్బందులు పెడుతున్నారు.

ప‌శ్చిమ బెంగాల్‌లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో అక్క‌డ లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ప్ర‌స్తుతం ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్య‌క్తి లాక్‌డౌన్ స‌మ‌యంలో స్వీట్ల కొనుగోలు చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఈ వీడియోలో ఉంది.

వీడియోలో ఏం ఉందంటే.. ఓ వ్య‌క్తి బెంగాలీ స్వీట్స్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చి పోలీసుల‌కు దొరికిపోయాడు. ఎక్క‌డికి వెళ్లాలి అని పోలీసులు అడిగితే, స్వీట్స్ కోసం వ‌చ్చిన‌ట్టు మెడ‌లో బోర్డును చూపించి అడిగాడు. ఐడి కార్డు, స్పెష‌ల్ పాస్ వెసుకున్న‌ట్టుగా ఆ యువ‌కుడు మెడ‌లో బెంగాలీ స్వీట్స్ కావాలి అంటూ బోర్డును మెడ‌లో వేసుకొని తిరుగుతున్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్ల‌కు తెగ న‌వ్వు తెప్పిస్తోంది. కాగా.. బెంగాల్‌లో లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ మిఠాయి దుకాణాలు కొద్ది స‌మ‌యం పాటు తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చారు.


Next Story