టీవీ చూస్తూ నిద్రపోండి.. నెలకు రూ.25లక్షల జీతం..!
Bed Rest Job In The Salary Of Rs 25 Lakh.మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా చోట్ల ఉద్యోగుల శ్రమ దోపిడి అధికంగా
By తోట వంశీ కుమార్ Published on 19 Oct 2021 2:03 PM ISTమన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా చోట్ల ఉద్యోగుల శ్రమ దోపిడి అధికంగా ఉంటుందనేది కాదనలేని వాస్తవం. ఎక్కువ గంటలు పని చేయించుకుని చాలా తక్కువ జీతం ఇస్తుంటారు. అయితే.. తక్కువ సమయం పని చేసి నెలకు రూ.25లక్షలు జీతం వస్తే ఎలా ఉంటుంది. హాయిగా బెడ్‌పై కూర్చొని టీవీ చూస్తూ నిద్రపోయినా.. జీతం వస్తే బాగుండు అని మనలో చాలా మంది అనుకునే ఉంటారు కదా. అలాంటి ఉద్యోగాన్నే ఇచ్చేందుకు ముందుకు వచ్చింది యూకేకు చెందిన ఓ కంపెనీ. మంచం మీద పడుకోని టీవీ చూడటమే ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని. అవునండి ఇది నిజంగా నిజమే.
ఓ లగ్జరీ బెడ్ కంపెనీ ఈ ఆఫర్ ను అందిస్తోంది. క్రాఫ్టెడ్ బెడ్ ఇచ్చిన ప్రకటన ప్రకారం ఈ కంపెనీలో ఉద్యోగం పొందిన వ్యక్తి రోజుకు 6 నుంచి 7 గంటలు బెడ్‌పై ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో అతడు టీవీ చూడొచ్చు. పడుకోవచ్చు కూడా. ఆ బెడ్‌ను పరీక్షించి, సమీక్ష చేయాలి. వారానికి కనీసం 37.5 గంటలు పరుపుపై గడపాల్సి ఉంటుంది. ఆ అనుభవాన్ని కంపెనీకి తెలియజేయాలి. ఇందుకు గానూ నెలకు రూ.24లక్షల 79 వేలు జీతాన్ని చెల్లిస్తుంది. ఇందుకోసం ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేదు. కంపెనీ వాళ్లే.. ఆయా ఉద్యోగుల ఇళ్లకి బెడ్లు, దిండ్లు పంపిస్తుందట. ఇక ఈ ఉద్యోగానికి మన దేశానికి చెందిన వారు అనర్హులు. కేవలం బ్రిటన్ పౌరసత్వం ఉన్నవాళ్లకే ఈ ఉద్యోగాలట. మన దేశంలో కూడా ఇలాంటి జాబ్స్ ఉంటే ఎంతో బాగుండు కదా అని అంటున్నారు.. ఈ ఉద్యోగ ప్రకటన చూసిన నెటిజన్లు.
ఇలాంటి ఉద్యోగాలు కొత్తవేం కాదు. బెడ్లు తయారు చేసే ఇంటర్నేషనల్ సంస్థలు.. తాము తయారు చేసే బెడ్ల వల్ల వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండేందుకు ఇలాంటి ఉద్యోగాలను ఆఫర్ చేస్తుంటాయి.