ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన అజీమ్ మన్సూరీ నిరీక్షణ ఫలించింది. ఎన్నో ఏళ్లుగా పెళ్లి చేసుకోవాలన్న 26ఏళ్ల అజీయ్ కోరిక నెరవేరుతోంది. ఇంతకాలం అతడికి పెళ్లి కాకపోవడానికి అతడి ఎత్తే కారణం. అతడి ఎత్తు కేవలం 2.5ఫీట్లు. కైరానా గ్రామానికి చెందిన అతడు ఓ కాస్మెటిక్ దుకాణం నడుపుతూ మంచిగానే సంపాదిస్తున్నాడు. ఏవో కొన్ని సంబంధాలు వచ్చినా.. వచ్చినట్లే వెళ్లిపోతుండడంతో అజీమ్‌కు పెళ్లి అనేది తీరని కలగానే మిగిలిపోయింది. దీంతో తనకు పెళ్లి చేయాలని ఇటీవల పోలీసుల సాయం కోరాడు. దీంతో అతడి గురించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. అతడికి ఇప్పుడు వధువు దొరికింది. హాపుర్‌లోని బుస్రాను అతని పెళ్లి చేసుకోనున్నాడు. మరుగుజ్జు మన్సూరీకి తగినట్లుగా మరుగుజ్జు బుస్రా ఉంది. హాపుర్‌లో ఉన్న బుస్రా ఇంటికి వెళ్లిన మన్సూరీ.. ఒక గోల్డ్ రింగ్‌ను, 2100 నగదును ఇచ్చాడు. ఇక బుస్రా ఫ్యామిలీ కూడా మన్సూరీకి గొల్డ్ రింగ్‌తో పాటు 3100 క్యాష్‌ను ఇచ్చారు. మాన్సూరీ 5వ తరగతి డ్రాపౌట్. మరుగుజ్జు కావడం వల్ల తనకు జీవితభాగస్వామి దొరకడం లేదని 2019లో యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను కూడా అతను కలిశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆయనకు ఆఫర్స్ రావడం మొదలయ్యాయి.